Chiranjeevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్నటువంటి స్థానం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, ఆ తర్వాత హీరో గా ఎదిగి, ఖైదీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి, అక్కడి నుండి వరుసగా హిట్ మీద హిట్ కొడుతూ మెగాస్టార్ గా ఎదిగాడు. అలా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అత్యధిక సంవత్సరాలు ఇండస్ట్రీ లో నెంబర్ 1 హీరో గా కొనసాగిన ఏకైక హీరో గా చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఏకంగా మూడు వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలను కొల్లగొట్టి, టాలీవుడ్ నేటి తరం స్టార్ హీరోలు కూడా తన ఏమాత్రం పోటీ కాదు అని మరోసారి నిరూపించాడు. అయితే గత ఏడాది ఆయన హీరోగా నటించిన ఆచార్య చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఆ సినిమాకి చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం వెనక్కి ఇచ్చేసాడు అనే సంగతి అందరికీ తెలిసిందే. బ్రేక్ ఈవెన్ నెంబర్ కి 50 కన్నా తక్కువ రికవరీ రేట్ ఉన్న సినిమాలకు చిరంజీవి మొదటి నుండి ఇలాగే ఇస్తూ వస్తున్నాడు. అలా ఆచార్య చిత్రానికి కూడా తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం ఇచ్చేసాడు, గతం లో మృగరాజు , బిగ్ బాస్ వంటి సినిమాలకు కూడా ఇలా చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ ని మొత్తం తిరిగి ఇచ్చేశాడట.
ఒక సినిమా కోసం ఎన్నో నెలలు కష్టపడాలి, ఎంతో సమయం , డబ్బు ని వెచ్చించాలి. అన్ని రోజులు కస్టపడి పని చేసిన సినిమాకి ఒక్క పైసా రెమ్యూనరేషన్ తీసుకోకుండా చెయ్యడం అంటే మామూలు విషయం కాదు. చిరంజీవి లో ఉన్న ఈ గొప్ప వ్యక్తిత్వమే తమ్ముడు పవన్ కళ్యాణ్ కి కూడా అలవాటు అయ్యింది. సినిమాలు ఫ్లాప్ అయ్యినప్పుడు ఆయన కూడా ఇలాగే తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం తిరిగి ఇచ్చేసేవాడు.