https://oktelugu.com/

Pawan Kalyan: ఆశ్చర్యపరుస్తున్న పవన్ కళ్యాణ్ 2వ కూతురు పోలేనా లేటెస్ట్ ఫోటోలు..ఇంత తక్కువ సమయంలో ఈ రేంజ్ మార్పా?

పోలేనా పవన్ కళ్యాణ్ మరియు అన్నా లెజినోవా మరియు పవన్ కళ్యాణ్ కి పుట్టిన అమ్మాయి. ఆ అమ్మాయి క్రిస్టియన్ మతానికి చెందింది అవ్వడం తో తిరుమల లో డిక్లరేషన్ ఇచ్చింది. పోలేనా ఇంకా మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పై సంతకం చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 2, 2024 / 12:55 PM IST

    Pawan Kalyan(17)

    Follow us on

    Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గత 11 రోజుల నుండి తిరుమల శ్రీవారి కోసం ప్రాయశ్చిత్త దీక్ష మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. నేటితో ఈ దీక్ష ముగియడంతో ఆయన తిరుమల కి విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన ఇద్దరు కూతుర్లు ఆద్య, పోలేనా కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. కొడుకు అకీరానందన్, ఆనంద్ సాయి, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు థమన్ వంటి వారు కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి వచ్చారు. అయితే పోలేనా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. చూస్తూ ఉండగానే ఈ అమ్మాయి ఇంతలా ఎలా ఎదిగిపోయింది అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 2017 వ సంవత్సరం లో పోలేనా చాలా చిన్న అమ్మాయిగా కనిపించింది. రామ్ చరణ్ కి రాఖీ కడుతూ కనిపించిన ఈ చిన్నారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంత ఎత్తుకి ఎదిగి కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.

    పోలేనా పవన్ కళ్యాణ్ మరియు అన్నా లెజినోవా మరియు పవన్ కళ్యాణ్ కి పుట్టిన అమ్మాయి. ఆ అమ్మాయి క్రిస్టియన్ మతానికి చెందింది అవ్వడం తో తిరుమల లో డిక్లరేషన్ ఇచ్చింది. పోలేనా ఇంకా మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పై సంతకం చేసారు. దానికి సంబంధించిన వీడియో ని కూడా జనసేన పార్టీ విడుదల చేసింది. మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని ప్రభుత్వం కోరినందుకు అసలు తిరుమలకు వెళ్లే కార్యక్రమాన్నే రద్దు చేసుకున్నాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా నిబంధనలను అతిక్రమించకుండా ఉన్నందుకు సోషల్ మీడియా లో ఆయనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇది ఇలా ఉండగా ఆద్య, పోలేనా ఫోటోలను చూసి ఇద్దరు కవల పిల్లలు లాగానే ఉన్నారు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేసారు. ఇద్దరు పవన్ కళ్యాణ్ పోలికలతో ఉండడం వల్ల అభిమానులకు అలా అనిపించింది.

    సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితో కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇద్దరికీ తల్లులు వేరు అయినప్పటికీ కూడా ఆప్యాయంగా పలకరించుకున్న తీరుని చూస్తుంటే పవన్ కళ్యాణ్ వాళ్ళను ఎంత గొప్ప పెంచాడో అర్థం అవుతుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ లడ్డు తయారీ కర్మాగారం కి వెళ్లి పనులను మొత్తం సందర్శించారు. నాణ్యత పై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు రావుతో కలిసి పవన్ కళ్యాణ్ అన్న ప్రసాదాన్ని ఆస్వాదించాడు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో విడుదలైంది. రేపు సాయంత్రం ఆయన 10 లక్షల మంది జనాలతో వారాహి సభను తిరుపతి లో నిర్వహించబోతున్నాడు. ఈ సభ కోసం కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.