కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. తీస్తే ఇలాంటి దమ్మున్న గట్స్ సినిమానే తీయాలి. ఈ సినిమాతో పవన్ అప్పులన్నీ ఎగిరిపోయాయి. దరిద్రం ఆమద దూరం పోయింది. పార్టీ కోసం.. డబ్బుల కోసమే సినిమా తీస్తున్నాన్న పవన్ కోరిక ‘వకీల్ సాబ్’తో తీరింది. ఇప్పుడు ‘వకీల్ సాబ్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఇటు హీరో పవన్ కళ్యాణ్, అటు నిర్మాత దిల్ రాజు ఫుల్ హ్యాపీ అంట.. ఎందుకంటే నాన్చి నాన్చి బయటకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది. రికార్డు కలెక్షన్లతో లాభాల పంట పండించింది.
ఈ సినిమా ఇప్పటిదాకా మొత్తం 150 కోట్ల వసూళ్లు సాధించినట్టు టాలీవుడ్ వర్గాల భోగట్టా.. ముందుగా అనుకున్న దాని ప్రకారం.. పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా కోసం రూ.50 కోట్ల పారితోషికంతోపాటు లాభాల్లో వాటా ఇస్తానని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చాడట..
ఇప్పుడు అన్నీ పోను పవన్ కళ్యాణ్ కు లాభాల్లో వాటాగా మరో రూ.15 కోట్లు ఇచ్చినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అంటే వకీల్ సాబ్ సినిమాకు గాను పవన్ కు ఏకంగా రూ.65 కోట్ల పారితోషికం వచ్చిందన్న మాట..
ఇక నిర్మాత దిల్ రాజుకు అన్నీ పోను రూ.50 కోట్లు లాభం వచ్చినట్టు సమాచారం. ఇక ఇందులోంచి రూ.కోటి రూపాయలను వకీల్ సాబ్ లో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ కు రెమ్యూనరేషన్ గా పంచినట్టు తెలుస్తోంది. ఇక పార్ట్ నర్ బోనీకపూర్ కు కూడా ఇందులోనే వాటా ఇవ్వనున్నారు.
ఇలా ఒకే ఒక్క సినిమాతో నిర్మాత దిల్ రాజు, పవర్ స్టార్ పవన్ లాభాల పంట పండించుకున్నారు. వీరిద్దరికి ఈ సినిమా ఊహించని సంపదను తెచ్చిపెట్టిందని ఇండస్ట్రీలో సినిమాకు వచ్చిన లాభాలపై చర్చ జరుగుతోంది.