Pawan Future CM RRR Writer Crazy Comments: టాలీవుడ్ లో ఏ హీరోకి లేని క్రేజ్ ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉంది. ఏ హీరోకి లేని భక్తులు ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉన్నారు. అందుకే.. పవన్ కళ్యాణ్ అంటే పవర్ కి ప్రతిరూపం. తాజాగా నేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ పవన్ పై క్రేజీ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ – రాజమౌళి కాంబినేషన్ గురించి మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం మాకు రాకపోవచ్చు. అప్పటి లోపు ఆయన సీఎం కూడా అయిపోవచ్చు’ అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు.
Pawan Kalyan
గతంలో కూడా విజయేంద్ర ప్రసాద్.. పవన్ కళ్యాణ్ చరిష్మా గురించి మాట్లాడుతూ.. ‘అసలు పవన్ కళ్యాణ్‌కు కథే అవసరం లేదు. పవన్ ఉంటే చాలు.. ఆయనను చూడటానికే జనాలు వస్తారు. పాటలు, ఫైట్లు, అక్కడక్కడా కొన్ని సీన్లు పేర్చితే కథ అయిపోతుంది. అసలు పవన్ స్థాయి వేరు. ఆయనను మించిన మరో స్టార్ లేరు. పవన్ ఓ డైనమైట్’ అంటూ విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర కామెంట్లు చేసి పవన్ అభిమానుల్లో జోష్ ను పెంచారు.
Also Read: NTR: ఆ డైరెక్టర్ తో సినిమా ఏందీ..? ఎన్టీఆర్ తప్పుచేస్తున్నాడా?
Pavan Kalyan
ఆయన చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ ఓ యూనిక్ పర్సన్. పవన్ నడక, చూపు, మాట.. ఇలా పవన్ ప్రతి కదలికలో ఓ పవర్ ఉంటుంది. పవన్ కంటిలోని మెఱుపుకి ఓ ఆకర్షణ ఉంటుంది. దూరం నుంచి చూసిన వాళ్ళు పవన్ కి తిక్క ఉంది అంటారు, ఆయనను అర్థం చేసుకున్న వాళ్ళు పవన్ లెక్కే వేరు అంటారు. ఎవరు ఏమనుకున్నా పవన్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు.
Pawan Kalyan
సాయం చేయడం తన స్వభావం, సేవ చేయడం తన గుణం. ప్రజల గురించి ఆలోచించడం తన అలవాటు. అందుకే పవన్ స్టార్ డమ్ కి పరిమితులు పరిధులు లేవు. సినిమా ఇండస్ట్రీలో ఎందరు స్టార్లు ఉన్నా.. ఎందరు సూపర్ స్టార్లు, ఎందరు ఐకాన్ స్టార్లు వచ్చినా.. వాళ్ళంతా పవర్ స్టార్ తర్వాతే.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే విజయేంద్ర ప్రసాద్ పై విధంగా కామెంట్స్ చేశారు.
vijayendra prasad
పైగా ఈ కామెంట్స్ లో ఎక్కడా అతిశయోక్తి లేదు. ప్రతి అక్షరం నిజమే. పవన్ కి ఉన్న విభిన్నమైన శైలి మరో హీరోకి లేదు రాదు. పవన్ ప్రవర్తనకు ఉన్న వైవిధ్యమైన నైజం మరో హీరో చూపించలేడు. తెచ్చి పెట్టుకోలేడు. అందుకేనేమో పవన్ అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకం.. పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకంగా చూస్తోంది. మరి విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్టు పవన్ రానున్న కాలంలో సీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also Read:Corona 4th Wave: కరోనా నాలుగో దశ ప్రారంభం కానుందా?