Pawan fans fire: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద ఫైర్ స్ట్రోమ్ ని సృష్టించి ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు కలెక్షన్ల వర్షం కురిపించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం నిన్న రాత్రి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో, ఓటీటీ లో కూడా అలాంటి రెస్పాన్స్ వచ్చింది. పవన్ అభిమానులు సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన ఎలివేషన్ షాట్స్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ, ఇంత అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినందుకు ధన్యవాదాలు అంటూ డైరెక్టర్ సుజిత్(Sujeeth) ని ట్యాగ్ చేసి ట్వీట్లు వేస్తున్నారు. అయితే అదే అభిమానులు సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించారంటూ సోషల్ మీడియా లో ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా మొదటి వారం పూర్తి అయ్యాక సినిమాకు జత చేసిన ఐటెం సాంగ్, ఓటీటీ వెర్షన్ లో లేదని పవన్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా సినిమాలో చూడని సన్నివేశాలను ఓటీటీ వెర్షన్ లో జత చేసి విడుదల చేస్తారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అలాంటివేమీ జరగలేదు. ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా అదనంగా కనిపించలేదు. దీనిపై కూడా పవన్ ఫ్యాన్స్ మూవీ ప్రొడక్షన్ ని ట్యాగ్ చేసి తిట్టడం మొదలు పెట్టారు. దీనికి మూవీ టీం స్పందిస్తూ ఓటీటీ కి సెన్సార్ చేయబడిన కాపీ నే వెళ్లిందని, ఎలాంటి అన్ కట్ వెర్షన్ ఉండదని చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే ఓజీ మేనియా థియేటర్ లో కంటే ఓటీటీ లో విడుదలయ్యాకే వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు ఫ్యాన్స్. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఇలా ఎక్కడ చూసినా ఓజీ గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ అయితే ఈ సినిమాని చూసి మెంటలెక్కిపోతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతుందని అనుకున్న ఓజీ చిత్రం, చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లోనే విడుదలైన సంగతి తెలిసిందే.
అందుకే ఇతర భాషల్లో ఉన్న మూవీ లవర్స్ కి ఈ చిత్రంని చేరుకోలేదు. కానీ వాళ్లకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యిందని, ఓటీటీ లోకి వస్తే మిస్ కాకుండా చూడాలనే ఆశ మాత్రం ఉంది. అందుకే వచ్చిన వెంటనే ఈ సినిమాని చూసి అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్ వేరే లెవెల్ లో ఉందని, ఇలాంటి మంచి సినిమాని థియేటర్స్ లో మిస్ అయ్యినందుకు బాధపడుతున్నాము అంటూ చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఇంకా ఎన్ని లక్షల మంది ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అనేది. ప్రస్తుతానికి నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న సినిమాగా #RRR ఉంది. ఆ తర్వాత లక్కీ భాస్కర్ చిత్రం ఉంది. ఈ రికార్డుని ఓజీ బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి.