Renu Desai latest comments: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) సోషల్ మీడియా లో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దశాబ్దం పైగా ఆమె ట్విట్టర్, ఫేస్ బుక్ మరియు ఇన్ స్టాగ్రామ్ యాప్స్ లో కొనసాగుతూ వస్తుంది. ట్విట్టర్ లో తీవ్రమైన నెగిటివిటీ ని తట్టుకోలేక, అక్కడ తన అకౌంట్ ని శాశ్వతంగా క్లోజ్ చేసింది. ఇప్పుడు ఆమె ఇన్ స్టాగ్రామ్ మరియు ఫేస్ బుక్ యాప్స్ లో రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. తన పిల్లలు అకిరా నందన్, ఆద్య లకు సంబంధించిన విశేషాలు షేర్ చేయడమే కాకుండా, నిత్యం సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా జంతువులు పట్ల ఈమె చూపించే ప్రేమ ని మెచ్చుకోవలసిందే. అప్పుడప్పుడు పవన్ అభిమానులు అడిగే ప్రశ్నలకు చిరాకు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూ లో ఆమె తన పిల్లలు అకిరా నందన్(Akira Nandan), ఆద్య(Aadya) గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. అకిరా కి సినిమాల్లోకి రాక ముందే స్టార్ హీరో రేంజ్ స్టేటస్ వచ్చిందని, నేను ఎక్కడికి వెళ్లినా అకిరా నందన్ ఎప్పుడు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నాడు అనే అడుగుతున్నారు. కానీ వాడికి మ్యూజిక్ మీద పిచ్చి ఆసక్తి ఉంది. ఇప్పటికే అనేక షార్ట్ ఫిలిమ్స్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించాడు. ఒక మెయిన్ కమర్షియల్ సినిమాకు మ్యూజిక్ ని అందించే రేంజ్ కి అకిరా ఎదిగాడు, వాడి భవిష్యత్తు ఎటు వైపు వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆద్యకి సినిమాల్లోకి వచ్చే ఆసక్తి ఉందా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రేణు దేశాయ్ ఇచ్చిన సమాధానం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
ఆమె మాట్లాడుతూ ‘ఆద్య సినిమాల మీద ఎలాంటి ఆసక్తి లేదు. ఆమెకు చిన్న తనం నుండే ప్రజాసేవ చెయ్యాలనే తపన ఉంది. భవిష్యత్తులో ఆమె అడుగులు అటు వైపే వెళ్లే అవకాశాలు ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది. దీనిని బట్టీ చూస్తే పవన్ కళ్యాణ్ రాజకీయ వారసురాలిగా ఆద్య నిలబడబోతుందా?, ఆయన తర్వాత జనసేన పార్టీ పగ్గాలను రామ్ చరణ్ అందుకుంటాడని అభిమానులు అనుకున్నారు. ఇప్పుడు ఆద్య కి కూడా ప్రజాసేవ పై ఆసక్తి ఉందంటే, ఆమెకు కూడా జనసేన పార్టీ పగ్గాలు భవిష్యత్తులో దక్కే అవకాశాలు ఉంటాయా?, లేదంటే ఒక సామాన్య నాయకురాలిగానే జనసేన లో కొనసాగుతుందా అని అభిమానులు ఇప్పటి నుండే మాట్లాడుకుంటున్నారు. ఆద్య చూసేందుకు అచ్చం వాళ్ళ నాన్న పోలిక లాగానే అనిపిస్తుంది. లక్షణాలు కూడా ఆమెకు నాన్నవి వచ్చినట్టున్నాయి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.