Pawan fans : ఏ హీరోకైనా అభిమానులు మాత్రమే ఉంటారు. కానీ, ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే భక్తులు ఉంటారని మళ్ళీ రుజువు అయింది. ప్రస్తుతం తెలుగు తెరను పవన్ మేనియా పూర్తిగా కమ్మేసింది. గుడిలో పవన్ ‘భీమ్లా నాయక్’ పోస్టర్ కు పూజలు చేస్తున్నారు. శివాలయంలో శివలింగం వెనుక పవన్ పోస్టర్ ను పెట్టి పూజారులు హారతి ఇస్తూ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తోంది.

ఎక్కడ చూసిన భీమ్లా నాయక్ హడావిడే కనిపిస్తోంది. పవర్ స్టార్ అనే నినాదం పీక్స్ కు వెళ్ళింది. గుడిలో ‘భీమ్లా నాయక్ పోస్టర్’ పెట్టి పూజలు చేస్తున్నారు అంటేనే.. పవన్ స్టార్ డమ్ ఏంటో అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ పై ప్రేమ అంటే ఇది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి సిల్వర్ స్క్రీన్స్ పై మ్యాజిక్ చేయడానికి భీమ్లా నాయక్ ఇప్పటికే రెడీ అయ్యాడు.

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకోవడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. పైగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈ చిత్రంలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మురళీశర్మ, రావు రమేష్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మ్యూజిక్ సంచలనం తమన్ ఈ చిత్రానికి సంగీతమందించారు. కాగా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు యూఎస్ మార్కెట్ లోనూ.. ‘భీమ్లా నాయక్’ కలెక్షన్ల కేకలను భారీ స్థాయిలో పెట్టించేలా ఉన్నాడు. ఇప్పటివరకూ ఏ స్టార్ హీరో సినిమాకు రాని విధంగా భీమ్లా నాయక్ కి కలెక్షన్లు వచ్చేలా ఉన్నాయి. మరి, బాక్సాఫీస్ బాక్సు ఏ రేంజ్ లో బద్దలు అవుతుందో చూడాలి.
