Bheemla Nayak: ఏపీలో అధికార వైసీపీపై ఒంటికాలిపై లేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ను సీఎం జగన్ టార్గెట్ చేశారా? పవన్ నటించిన ‘భీమ్లానాయక్’ మూవీని ఏపీలో తొక్కేయడానికి ప్లాన్ చేశారా? క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ సినిమా ఆడే థియేటర్లలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను స్టిక్ట్ గా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందా? ఈ మేరకు భీమ్లానాయక్ థియేటర్లపై దాడులకు ఆంధ్రప్రదేశ్ లో రంగం సిద్ధమైందా? అంటే ఔననే ఆరోపిస్తున్నారు జనసైనికులు.. ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్స్, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా పవన్ కళ్యాణ్ ను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ఏపీలోని థియేటర్ యజమానులకు, డిస్ట్రిబ్యూటర్లకు సినిమా టికెట్ రేట్లు పెంచవద్దని.. జీవో 35 అమలు చేయాలని హెచ్చరికలు చేశారని ఒక టాక్ నడుస్తోంది. పవన్ సినిమా విడుదలయ్యాక వారం పాటు స్టిక్ట్ గా జీవో35ను అమలు చేయాలని మార్చి 1 వరకూ భీమ్లానాయక్ టికెట్ రేట్లు పెంచేది లేదని ఏపీ ప్రభుత్వ అధికారుల నుంచి ఆదేశాలు అందినట్టుగా సమాచారం.
ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. పలువురు ఏపీ థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఈ మేరకు ‘భీమ్లానాయక్’పై ఏపీ సర్కార్ కక్షసాధింపు చర్యలపై మండిపడుతున్నారట.. ఈ మేరకు ఈ విషయం ఆ నోటా ఈనోట బయటకు వచ్చింది. అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఏపీలో రాజకీయంగా జగన్ ను, వైసీపీని పవన్ తీవ్రంగా విభేదిస్తున్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై నిలదీస్తున్నారు. అప్పట్లో ‘రిపబ్లిక్ ’ వేడుకలోనూ.. ఇటీవలే మత్స్యకారుల సభలోనూ జగన్ తీరును పవన్ కడిగేశారు. సినీ పరిశ్రమ జగన్ ను వేడుకోవాలా? అంటూ నిప్పులు చెరిగారు. జగన్ ను రాజకీయంగా ఇబ్బందిపెడుతున్న పవన్ ను టార్గెట్ చేసి ఇప్పుడు భీమ్లానాయక్ కు ఆర్థికంగా నష్టం చేసేందుకే జీవో 35ను స్టిక్ట్ గా అమలు చేస్తున్నారని.. ఆ తర్వాతే ఈ జీవోను రద్దు చేసి సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.
ఇప్పటికే చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి లాంటి ప్రముఖులు వచ్చి కలిసి వెళ్లాక ఒక వారంలోనే సినీ పరిశ్రమకు శుభవార్త చెబుతామని జగన్ సర్కార్ హామీ ఇచ్చింది. దాన్ని ఇప్పటికీ అమలు చేయలేదు. అది అమలు కాకపోవడానికి ‘భీమ్లానాయక్’ మూవీయే కారణమని.. పవన్ పై ప్రతీకారంతోనే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం సాగుతోంది. ఇందులో నిజం ఎంతుందో కానీ ఈ మేరకు సోషల్ మీడియాలో హోరెత్తుతోంది.
[…] Pawan Kalyan- Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ’గా చిరపరిచయమే.. ఆయన ఖైదీగా నటించిన సినిమాలన్నీ ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చి మళ్లీ సినీ రంగప్రవేశం చేసింది కూడా ‘ఖైదీ’ సినిమాతోనే. అయితే చిరుకు ‘ఖైదీ’ సెంటిమెంట్ ఉండగా.. ఆయన తమ్ముడు పవర్ స్టార్ కు ‘పోలీస్’ సెంటిమెంట్ కలిసివచ్చింది. […]
[…] Pawan Kalyan Hari Hara Veera Mallu: క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ అప్ డేట్ తెలిసింది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తాజాగా కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా అదిరిపోయే సెట్స్ వేయబోతున్నారని. ఢిల్లీలోని చాందినీ చౌక్ ను రీక్రియేట్ చేయబోతున్నారని తెలుస్తోంది. అందుకోసం 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. […]