మెగాస్టార్ వారసత్వంతో తెలుగు ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ సినిమాతో పరిచయమైన పవన్ తర్వాత తర్వాత యూత్ ఐకాన్‌గా మారారు. బోలెడంత మంది యూత్‌కి క్రేజ్ స్టార్ అయ్యారు. అప్పుడప్పుడు రాజకీయాల్లోకి వచ్చి సినిమాలకు గ్యాప్ ఇస్తున్నా.. ఆయన అభిమానులు ఆయన్ను మరవడం లేదు. అప్పటికి ఇప్పటికీ ఆ అభిమానం అలాగే కొనసాగిస్తూనే ఉన్నారు.
Also Read:తండ్రీకొడుకులుగా మహేష్ బాబు..!
జనసేన అధినాయకుడిగా ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఇతర హీరోలతో పోలిస్తే పవన్ నిత్యం ఏదో ఒక టాపిక్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు అభిమానుల ప్రశ్నలకు ఆన్సర్ చేస్తూనే ఉంటారు.
ఇదంతా ఎలా ఉన్నా.. ఈ మధ్య పవన్ బర్త్‌డే సందర్భంగా తన కొత్త సినిమా అయిన వకీల్ సాబ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశాక అభిమానుల్లో హడావుడి ఇంత కాదు. ఏ ఫోన్‌లో చూసినా.. ఏ వాట్సాప్ స్టేటస్ చూసినా వకీల్ సాబ్ ఫొటోలే కనిపించాయి.
Also Read: బిగ్ బాస్ కి లౌక్యం చూపిస్తోన్న గంగవ్వ !
అయితే.. ఇటీవల పవన్ కల్యాణ్‌కి సంబంధించి రేర్ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫొటోలో పవన్ కాలేజ్ బాయ్‌లా కనిపిస్తున్నాడు. చాలా చిన్నపిల్లాడిలా.. సున్నిత మనస్కుడిగానూ ఉన్నాడు. ఇంకే ఆ ఫొటోను చూసిన అభిమానులంతా ఇక తమ డీపీలు చేంజ్ చేశారు. స్టేటస్‌లతో హోరెత్తించారు.