బిగ్ బాస్-4: అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఎవరికంటే?

తెలుగులో నెంబర్ రియల్టీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ ఇటీవల ప్రారంభమైంది. బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3లతో ఆకట్టుకున్న నిర్వహాకులు మరోసారి ప్రేక్షకులను ముందుకొచ్చారు. బిగ్ బాస్-3 సీజన్ కు హోస్టుగా వ్యవహరించిన కింగ్ నాగార్జునే బిగ్ బాస్-4కు కూడా హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. గ్రాండుగా ప్రారంభమైన బిగ్ బాస్-4 తొలిరోజు నుంచే మిక్సడ్ టాక్ తెచ్చుకొంది. Also Read:తండ్రీకొడుకులుగా మహేష్ బాబు..! 16మంది కంటెస్టులతో బిగ్ బాస్-4 ప్రారంభమైంది. అయితే వీరికి ఒక్కొక్కరికి […]

Written By: NARESH, Updated On : September 13, 2020 12:21 pm

bigboss 4 participants

Follow us on

తెలుగులో నెంబర్ రియల్టీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ ఇటీవల ప్రారంభమైంది. బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3లతో ఆకట్టుకున్న నిర్వహాకులు మరోసారి ప్రేక్షకులను ముందుకొచ్చారు. బిగ్ బాస్-3 సీజన్ కు హోస్టుగా వ్యవహరించిన కింగ్ నాగార్జునే బిగ్ బాస్-4కు కూడా హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. గ్రాండుగా ప్రారంభమైన బిగ్ బాస్-4 తొలిరోజు నుంచే మిక్సడ్ టాక్ తెచ్చుకొంది.

Also Read:తండ్రీకొడుకులుగా మహేష్ బాబు..!

16మంది కంటెస్టులతో బిగ్ బాస్-4 ప్రారంభమైంది. అయితే వీరికి ఒక్కొక్కరికి ఒక్కోలా రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. సెలబ్రెటీల స్థాయిని బట్టి ఒక్కొక్కకరికి లక్ష నుంచి 16లక్షల వరకు బిగ్ బాస్ నిర్వహకులు చెల్లిస్తున్నారు. హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జున ఒక్కొ ఎపిసోడ్ కు రూ.16లక్షలు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే కంటెస్టుల రెమ్యూనరేషన్లో మాత్రం పొదుపుమంత్రం పాటిస్తున్నారు.

ఈసారి బిగ్ బాస్ కంటెస్టుల్లో పెద్ద స్టార్స్ ఎవరూ లేకపోవడంతో నెటిజన్లు షోపై నెగిటివ్ ప్రచారంచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కంటెస్టుల్లో హీరోయిన్ మోనల్ గజ్జర్, యాంకర్ లాస్య, డెత్తడి హరిక, గంగవ్వ, దేవి నాగవల్లిలు మినహా ఎవరికీ జనాల్లోకి క్రేజ్ లేదని టాక్ విన్పిస్తోంది. వీరిస్థాయిని బట్టి బిగ్ బాస్ రెమ్యూనరేషన్లో పొదుపు మంత్రాన్ని పాటించినట్లు తెలుస్తోంది.

Also Read: బిగ్‌ బాస్ కి లౌక్యం చూపిస్తోన్న గంగవ్వ !

కంటెస్టులలో యాంకర్ లాస్యకు రోజుకు లక్ష రూపాయాల చొప్పున చెల్లిస్తున్నారట. పెళ్లి తర్వాత టీవీరంగానికి దూరంగా ఉన్న ఆమె బిగ్ బాస్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హీరోయిన్ మోనల్ గజ్జర్.. డెత్తడి హరిక.. దేవి నాగవల్లి.. అమ్మ రాజశేఖర్ తదితరులకు కూడా ఒక్కొక్కరికి ఒక్కో డీల్ సెట్ చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్లో ప్రత్యేక క్రేజ్ తో దూసుకెళుతున్న గంగవ్వకు కూడా అత్యధికంగా రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నారట. ఆమెకు వారానికి 3నుంచి 4లక్షల రెమ్యూనేషన్ చెల్లిస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.