Hari Hara Veera Mallu: వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం హరి హర వీర మల్లు..ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఒక పీరియాడిక్ తో మన ముందుకి రాబోతున్నాడు..సుమారు 150 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ మరియు మేకింగ్ వీడియో అభిమానులను మరియు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ట్రేడ్ లో కూడా పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న పీరియాడిక్ డ్రామా సినిమా కావడం తో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ప్రీ రిలీజ్ బిజినెస్ కి కూడా అన్ని ప్రాంతాల నుండి ఈ సినిమాకి క్రేజీ ఫాన్సీ ఆఫర్లు వస్తున్నాయి..కరోనా కారణంగా చాలా కాలం లాక్ డౌన్ పడడం..ఆ తర్వాత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ లో బిజీ అవ్వడం వల్ల హరి హర వీర మల్లు షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది..ఎట్టకేలకు పరిస్థితులు అన్ని చక్కబడడం తో ఇటీవలే షూటింగ్ ని తిరిగి ప్రారంబించుకున్న ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది.

Also Read: Nayanthara and Vignesh: స్టార్ అయితేనేమీ ఓ ఇంటికి కోడలేగా.,. నయనతారకు అత్తయ్య కండీషన్స్!
ఈ రెండు షెడ్యూల్స్ పూర్తి అయిన తర్వాత హరి హర వీర మల్లు షూటింగ్ కి భారీ గ్యాప్ వచ్చింది..నిర్మాత AM రత్నం కి బడ్జెట్ సమస్యలు రావడం వల్ల షూటింగ్ కి ఆలస్యం అవుతుందని..ఇలా పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం సాగాయి..అయితే అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనట..నటీనటుల డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే షూటింగ్ ఆలస్యం అయ్యిందని అంటున్నారు ఆ మూవీ టీం..ఇప్పుడు ఆర్టిస్టుల డేట్స్ అన్ని సర్దుబాటు అయ్యాయి అని..ఈ నెల 22 వ తారీఖున కానీ లేదా 25 వ తారీఖున కానీ ఈ సినిమా మూడవ షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇప్పటికే 60 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం రాబొయ్యే రెండు నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసి అక్టోబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషలలో ఘనంగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా..MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు..ఇక హాలీవుడ్ లో ఆక్వా మ్యాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు VFX డిజైనర్ గా పని చేసిన బెన్ లాక్ కూడా ఈ సినిమాకి పని చేస్తున్నాడు..ఇలా పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.

Also Read: Pawan Kalyan Bus Yatra: పవన్ కళ్యాణ్ సడెన్ గా బస్సు యాత్రకు అసలు కారణం ఏంటి?
[…] Also Read: Hari Hara Veera Mallu: ఈ నెల 22వ తారీఖు నుండి పవన్ కళ్… […]