Parvati Melton: సినిమాల్లో అవకాశం రావడం అరుదు. కానీ వచ్చిన తరువాత కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందని చెప్పలేం. ఒకప్పుడు ఒక్క ఛాన్స్ వస్తే చాలు జీవితం మారిపోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు పదుల కొద్ది సినిమాల్లో నటించినా స్టార్ ఇమేజ్ రావడం లేదు. ఒక వేళ స్పెషల్ ఇమేజ్ వచ్చినా అది ఎంతోకాలం నిలవడం లేదు. అయినా పలు సినిమాల్లో అవకాశాలు తెచ్చుకున్న ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అయితే కొన్నాళ్ల పాటు ఎంత కష్టపడినా.. అడపాదడపా సినిమాల్లో నటించి.. ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి వారిలో పార్వతి మెల్టన్ ఒకరు.
ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నారు పార్వతి మెల్టన్. ‘వెన్నెల’ సినిమాలో ఆమె నటనతో ఆకట్టుకున్నారు. ఆ తరువాత స్టార్ అవుతారని అనుకున్నారు. కానీ చాలా సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే సీనియర్ యాక్టర్ల సరసన నటించి పేరు తెచ్చుకున్న ఈమె అప్పటి స్టార్ నటిమణులకు పోటీ ఇస్తుందని అనుకున్నారు. కానీ అదీ జరగలేదు. దీంతో రెండో హీరోయిన్ గా చాన్స్ వచ్చినా నటించింది. అలా పవన్ కల్యాణ్ ‘జల్సా’ సినిమాలో నటించడంతో పార్వతి మెల్టన్ కు గుర్తింపు వచ్చింది. చివరకు బాలకృష్ణతో కలిసి ఓ సినిమాలో నటించింది.
అయితే ఎన్ని సినిమాల్లో నటించినా మిగతా హీరోయిన్లకు పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో అవకాశాలు రాకపోవడంతో చివరకు ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది. అయితే పార్వతి మెల్టన్ సినిమాల్లో లేకపోయినా బీచుల్లో.. జలపాతాల వద్ద తెగ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ తన అందచందాలతో ఫొటోలు దిగింది. వాటిని నెట్టింట్లో పెట్టేసరికి యూత్ షాక్ అవుతున్నారు. పార్వతి మెల్టన్ గుర్తుపట్టకుండా ఇలా మారిపోయిందేంటి? అని కామెంట్స్ పెడుతున్నారు.
చివరిగా ‘యమహా’ అనే సినిమాలో నటించిన ఈమె కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో ఉంటోంది. ఈమె ఇండో అమెరికన్. ఆమె తల్లిదండ్రులు భారతీయులే అయినా అమెరికాలో సెటిల్ అయ్యారు. దీంతో ఆమె ప్రస్తుతం అక్కడే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే మళ్లీ సినిమాల్లోకి అవకాశం వస్తే పార్వతి నటిస్తారా? అని తెగ చర్చించుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశాలు రావడం గగనమే అని అంటున్నారు.