https://oktelugu.com/

Paruvu Web Series Review : పరువు వెబ్ సిరీస్ రివ్యూ

Paruvu Web Series Review ఇక సినిమా కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్స్ అయితే చాలా క్లియర్ కట్ గా మనకు కనిపిస్తున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : June 17, 2024 / 10:10 PM IST

    Paruvu Web Series Review

    Follow us on

    Paruvu Web Series Reviw : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలైతే తెరకెక్కుతున్నాయి. ఇక ప్రస్తుతం అలాంటి కథతోనే ఇండస్ట్రీలో గుర్తింపును చాటుకోవడానికి చాలా మంది కొత్త దర్శకులు సినిమాలపైనే, వెబ్ సీరీస్ ల పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కొన్ని సినిమాలు ఓటిటిలో రిలీజ్ అయి సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఓటిటి కోసమే కొన్ని చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో నివేతా పేతురాజ్, నరేష్ అగస్త్య లీడ్ రోల్లో చేసిన ‘పరువు ‘ వెబ్ సీరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే పల్లవి (నివేత పెతురాజ్) పెద్దలను ఎదిరించి సుధీర్ (నరేష్ అగస్త్య) ని ప్రేమ వివాహం చేసుకుంటుంది. అయితే కులం తక్కువ వాడు అనే ఉద్దేశ్యం తో సుధీర్ అంటే ఇంట్లో వాళ్లేవరికీ ఇష్టం ఉండదు. ఇక దానికి కారణం చేతనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా తను వేరే దగ్గర ఉంటూ వాళ్ల లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ పెదనాన్న చనిపోయాడు అనే విషయాన్ని తెలుసుకున్న తను ఊరు బయలుదేరాలనుకుంటుంది. ఇక ఇదే క్రమంలో తన బావ అయిన చందు వీళ్ళను తన కారులో ఎక్కించుకొని వాళ్ళను ఊరు తీసుకెళ్తుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే చందు సుధీర్ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటాడు. చందు అలా మాట్లాడటం పల్లవి నచ్చక చందు తో ఆర్గుమెంట్ చేస్తుంది.

    ఇక ఇదిలా ఉంటే మార్గమధ్యలో చందు ఒక రివాల్వర్ ను కొంటాడు. అయితే ఆ రివాల్వర్ తో తమను చంపబోతున్నాడని పల్లవి అపోహ పడి సుధీర్ కి చెబుతుంది. ఇక దాంతో సుదీర్ చంద్ ని చంపేస్తాడు.. మరి వీళ్ళు చందు శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టారు. చందు కోసం వెతుకుతున్న వాళ్ల ఫ్యామిలీకి చందు ను ఎవరు చంపారో ఇన్ఫర్మేషన్ తెలిసిందా లేదా.? పల్లవి సుధీర్ లే అతన్ని మర్డర్ చేశారనే విషయం బయటకు వచ్చిందా అనే విషయం తెలియాలంటే జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ని మీరు చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఏ పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నారో ఆ పాయింట్ ను చాలా క్లియర్ గా చెప్పాడు. అలాగే మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఈ వెబ్ సిరీస్ ను చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక అందులో భాగంగానే ఈ సిరీస్ కి సిద్ధార్థ్ నాయుడు రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. అలాగే డైరెక్షన్ పరంగా చూసుకున్న ఈ సినిమా అనేది చాలా గ్రాండ్ గా తెరకెక్కించడం అనేది కూడా చాలా వరకు ప్లస్ అయింది. ఇక ప్రతి సీన్ లో కూడా ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తూ ఆయన ఎక్కడ కూడా స్టోరీ ని అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లనివ్వకుండా చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు. అయితే ఈ సీరీస్ లో ట్విస్ట్ లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.

    ఇక ఈ జనరేషన్ లో కూడా పరువుకు సంబంధించిన ఇమేజ్ ని చూస్తూ కొందరు వ్యక్తులను కులం పేరుతో దూరం పెడుతున్నారు అనే వాటిని కూడా చాలా క్లియర్ కట్ గా చూపించారు. ఇక కులం పేరుతో చాలామంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా సినిమాలో చూపించడం విశేషం… ఇక మొత్తానికైతే ఈ సిరీస్ తో ఆయన సూపర్ సక్సెస్ సాధించడనే చెప్పాలి. ఇక శ్రావణ్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి చాలావరకు ప్లస్ అయింది. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక సస్పెన్స్ ని క్రియేట్ చేసేటప్పుడు ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలావరకు రిచ్ గా ఉన్నాయి…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే నివేతా పెతురాజ్ చాలా మంచి నటి అయినప్పటికీ ఆమెకి సరైన క్యారెక్టర్ పడటం లేదు. కానీ ఈ సిరీస్ లో ఆమెకి చాలా మంచి క్యారెక్టర్ దొరకడమే కాకుండా ఆ పాత్ర ను సరిగ్గా పోట్రే కూడా చేసింది. ఇక మొత్తానికైతే తను ఈ సిరీస్ తో నటిగా మరొక మెట్టు పైకి ఎక్కిందనే చెప్పాలి. ఇక నరేష్ అగస్త్య కొన్ని సీన్లలో చాలా మంచి పర్ఫామెన్స్ ని చూపించాడు. ఓవరాల్ గా తను కూడా ఈ సిరీస్ కి చాలా వరకు హెల్ప్ అయ్యాడు… నాగబాబు పోషించిన పాత్ర కూడా ఈ సినిమాకి చాలా కీలకమైన పాత్ర అనే చెప్పాలి. నాగబాబు తప్ప మరొకరు చేయలేరు అనేంతలా ఆయన కూడా చాలా బాగా నటించి మెప్పించాడు… ఇక మిగిలిన ఆర్టిస్టు లు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సీరీస్ కి మ్యూజిక్ అందించిన శ్రావణ్ భరద్వాజ్ చాలా ఇంటెన్స్ మ్యూజిక్ ని ఇచ్చాడు. చాలా వరకు సీన్లు ఎలివేట్ అవ్వడంలో తను కీలకపాత్ర వహించాడనే చెప్పాలి. ఇక విజువల్స్ పరంగా చూసుకుంటే విద్యా సాగర్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపింది. ఆయన అందించిన విజువల్స్ సినిమాకి ప్రాణం పోసాయనే చెప్పాలి. కొన్ని షాట్స్ అయితే చాలా రిస్క్ చేసి మరి చేసినట్టుగా అర్థమవుతుంది. ఇక సినిమా కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్స్ అయితే చాలా క్లియర్ కట్ గా మనకు కనిపిస్తున్నాయి…

    ప్లస్ పాయింట్స్

    నివేతా పెతురాజ్, నాగబాబు యాక్టింగ్
    స్క్రీన్ ప్లే
    ట్విస్ట్ లు

    మైనస్ పాయింట్స్

    రోటీన్ స్టోరీ
    కొన్ని సీన్లు లాగ్ అయ్యాయి…

    రేటింగ్
    ఈ సిరీస్ కి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5

    చివరి లైన్
    థ్రిల్లర్ సిరీస్ లను చూసేవాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది…