Parugu Heroine Sheela Kaur: సినిమాల్లో ఉన్నంతకాలం హీరోయిన్లు అందచందాలతో అలరిస్తారు. అవకాశాలు తగ్గి ఇండస్ట్రీ నుంచి దూరమయ్యాక కొందరి నటీమణుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. వెండితెరపై తమ బ్యూటీనెస్ చూపించిన భామలు ఆ తరువాత రకరకాల వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా తెలుగులో హీరోయిన్ గా చేసిన షీలా పరిస్థితి అలాగే మారిందని తెలుస్తోంది. తెలుగులో కొన్ని సినిమాల్లోనే నటించిన షీల అతికొద్ది కాలంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించింది. మొదట్లో సోలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత రెండో హీరోయిన్ గా చాలా సినిమాల్లో వచ్చారు. అయితే షీలా ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలిస్తే కన్నీళ్లు ఆగవంటున్నారు.
Parugu Heroine Sheela Kaur
‘సీతాకోకచిలుక’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది షీలా. అయితే ఈ సినియా యావరేజ్ గా ఉండడంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు. ఆ తరువాత మంచు మనోజ్ తో కలిసి ‘రాజుబాయ్’లో అలరించింది. అయితే ఆ తరువాత అల్లు అర్జున్ తో కలిసి నటించిన ‘పరుగు’తో షీలా స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత వరుసగా మస్కా, అదుర్స్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆ తరువాత నటీమణుల మధ్య పోటీ పెరగడంతో షీలా సినిమాల నుంచి తప్పుకుంది.
ఆ తరువాత ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న షీలాకు క్యాన్సర్ వ్యాధి సోకిందట. అయితే షీలా కు క్యాన్సర్ ఉన్న విషయం ఆమె ఎప్పుడూ బయటపెట్టలేదు. తనకు ఈ వ్యాధి ఉన్నా కొన్ని సినిమాల్లో నటించిదట. తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలోనూ పలు సినిమాలు చేసిన ఈ భామ ఆ తరువాత క్యాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకుంటుందట. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ తో పోరాడుతోందని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నారు.
Also Read: లోదుస్తులతో అరాచకం.. అవకాశాల కోసమేనా ఈ బరి తెగింపు !
Parugu Movie Fame Sheela Kaur
అయితే ఈ విషయాన్ని అమె ఎవరికీ చెప్పుకోవడం లేదట. ఎవరి సాయం తీసుకోకుండా ఆమె జీవితాన్ని ఆమె మేనేజ్ చేసుకుంటుందట. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన షీలా ఇప్పుడు సూపర్ మార్కెట్ పెట్టుకుని నడిపిస్తుందని అంటున్నారు. అయితే ఇతరులను సాయం అడగడం ఇష్టం లేకనే, తన కాళ్లపై తాను నిలబడాలని సూపర్ మార్కెట్ స్టోర్ నిర్వహిస్తోందట. అయితే షీలా గురించి తెలిసిన వాళ్లు షాక్ అవుతున్నారు. తెలుగు సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న షీలా పరిస్థితి ఇలా మారిందేమిటి..? అని చర్చించుకుంటున్నారు. అయితే ఆమె లెటేస్టు ఫొటోస్ కూడా ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్తపడుతుండడం విశేషం.
Parugu Movie Heroine Sheela
Also Read: అందంగా కనపడేందుకు అదే నా సీక్రెట్ అంటున్న తాప్సీ…