Salaar: అందుకే సలార్ హిట్ అయ్యింది.. లేదంటే ఫ్లాప్ నే.. స్టార్ రైటర్ కామెంట్స్ వైరల్

డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన రెండో భాగంపై ఆసక్తిని నెలకొల్పింది.

Written By: Swathi, Updated On : January 30, 2024 1:28 pm
Follow us on

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటించిన సినిమాలు రీసెంట్ గా ఫ్లాప్ లను సొంతం చేసుకున్నాయి. కానీ రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో మరోసారి తన క్రేజ్ ను నిరూపించుకున్నారు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత 3 పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రభాస్. కానీ ఈ మూడు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఇటీవల ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా మాత్రమే హిట్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన రెండో భాగంపై ఆసక్తిని నెలకొల్పింది. ఇక పార్ట్ 2 ఎప్పుడు వస్తుందంటూ ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు ప్రభాస్, ప్రశాంత్ నీల్ అభిమానులు. అయితే థియేటర్లలో సక్సెస్ ను సాధించిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులను సందడి చేస్తోంది.

రీసెంట్ గా సలార్ సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ కొన్ని కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్లు వైరల్ గా మారాయి. యాక్షన్, జానపదం, పౌరాణికం, సాంఘిక అంశాలు అన్నింటిని మేళవించి ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందించారు. అయితే సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ కాకుండా ఏ డైరెక్టర్ దర్శకత్వం వహించిన కూడా అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకునేదని కామెంట్లు చేశారు. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ కు పెద్దగా డైలాగ్స్ లేవని.. మొదటి
30 నిమిషాలు కూడా ప్రభాస్ కు డైలాగ్స్ లేకపోవడం ఆశ్చర్యకరం అన్నారు.

ఈ సినిమాలో కాన్సర్ అనే ప్రాంతాన్ని చరిత్రతో మిక్స్ చేసి నమ్మినట్టుగా చూపించారు. ఏది ఏమైనా సలార్ సినిమాలో స్క్రీన్ ప్లే ఎంతో అద్భుతంగా ఉందని యాక్షన్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా చూపించారని కొనియాడారు గోపాలకృష్ణ. అంతేకాదు పార్ట్ 2 పై అంచనాలు పెంచేలా క్లైమాక్స్ ను రూపొందించారని సలార్ సినిమాపై ప్రశంసలు కురిపించారు పరుచూరి.