Heroine Pranitha: ‘ప్రణీత సుభాష్’ మంచి హీరోయినే కాదు, మంచి మనసు ఉన్న హీరోయిన్ కూడా. ఇక అందంలో అభినయంలో కూడా ప్రణీత సుభాష్ ను తక్కువ చేయలేం. అన్నింటికి మించి ప్రతిభ ఉన్న హీరోయిన్. పైగా బాపు బొమ్మ అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్. అయితే, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న మాదిరి తయారైంది ఆమె సినీ కెరీర్. సరే.. కెరీర్ ఎలా ఉన్నా.. ఆమె మాత్రం సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా సోషల్ మీడియాలో నేను, నా భర్త ఆ సినిమా చూసి ఏడ్చేశాం అని ఒక పోస్ట్ పెట్టింది. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. ప్రణీత తన ఇన్ స్టా గ్రామ్ హ్యాండిల్ లో ”మేము ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం చూశాము. అయితే, ఈ సినిమా పూర్తయ్యేసరికి నేనూ, నా భర్త ఏడ్చేశాం. సుమారు 30 ఏళ్ల క్రితం కశ్మీర్ పండిట్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో కళ్లకు కట్టినట్టు దర్శకుడు చూపించారు’ అని ఆమె మెసేజ్ పెట్టింది.
Also Read: ఎత్తరజెండా పాటను కూడా వదలని సజ్జనార్.. ఇలా వాడేశాడే
అలాగే ఆమె ఇంకా మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ చూడాలని కోరింది. మొత్తానికి ప్రణీత సుభాష్ మనసు మంచిది అంటారు. ఆమెకు నిర్మాతల కష్టాలు అర్థం చేసుకునే మనసు ఉన్నా, గొప్ప టాలెంట్ ఉన్నా, కావాల్సినంత గ్లామర్ ఉన్నా.. ఎందుకో హీరోయిన్ గా స్టార్ డమ్ ను సంపాదించలేకపోయింది.
దాంతో ఇక సోలోగా ఉంటే వర్కౌట్ అవ్వదు అనుకుందేమో. కరోనా కాలంలో పెళ్లి కూడా చేసేసుకుంది. ఇక ది కశ్మీర్ ఫైల్స్ సినిమా విషయానికి వస్తే.. సినీ పరిశ్రమలో ఇప్పుడంతా ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది. ఇది 1990 నాటి జమ్మూకశ్మీర్ పండిట్ల ఉచకోతల పై, వలసల నేపథ్యంలో వచ్చిన అతి వాస్తవిక చిత్రం. ఈ చిత్రం హిందూ మారణహోమంలోని కన్నీటి జ్ఞాపకం.
ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పుకుంటే.. ఎప్పుడో మర్చిపోయిన తమ మూలాల్ని గుర్తు తెచ్చుకొని థియేటర్లలోనే వెక్కి వెక్కి ఏడుస్తున్న వాస్తవ కన్నీటి గాధల గమనం ఇది. తీవ్రమైన తిరుగుబాటు.. అల్లరిమూకలు చెలరేగిపోయిన సమయంలో కట్టుబట్టలతో పారిపోయి వచ్చిన అభాగ్యుల జీవితాల నిధి ఇది.
ఒకపక్క తుపాకులతో స్వైర విహారం చేస్తూ.. హిందువులపై దాడికి తెగబడుతూ నరమేధం జరుపుతుంటే.. ఆ దారుణాలను తట్టుకోలేక కట్టుబట్టలతో సహా ఆత్మహత్య చేసుకున్న విషాద గుర్తులను తట్టిలేపిన చిత్రమిది.
Also Read: తోడు లేక ఒంటరితనంతో బాధపడుతున్న హీరోయిన్లు వీళ్లే