https://oktelugu.com/

Tollywood Trends : టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా చూసి తాను, తన భర్త ఏడ్చేశాం అని నటి ప్రణీత తెలిపింది. సుమారు 30 ఏళ్ల క్రితం కశ్మీర్‌ పండిట్స్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో కళ్లకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించారని ప్రణీత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అలాగే ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ చూడాలని కోరింది. కాగా 1980-90లలో కశ్మీర్‌లో ఓ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 16, 2022 / 03:45 PM IST
    Follow us on

    Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా చూసి తాను, తన భర్త ఏడ్చేశాం అని నటి ప్రణీత తెలిపింది. సుమారు 30 ఏళ్ల క్రితం కశ్మీర్‌ పండిట్స్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో కళ్లకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించారని ప్రణీత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అలాగే ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ చూడాలని కోరింది. కాగా 1980-90లలో కశ్మీర్‌లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాను తెరకెక్కించారు.

    pranitha

    ఇక మరో అప్ డేట్ ఏమిటంటే…మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. ఐతే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ ను వదిలింది. “గాడ్ ఫాదర్” మూవీలో స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ఈమేరకు భాయ్ కి స్వాగతం పలుకుతూ ప్రత్యేక ట్వీట్ చేసి..సల్మాన్‌ తో దిగిన ఫోటోను షేర్‌ చేశాడు.

    Also Read: అది ఇవ్వాలా అని సుధీర్‌ను అడిగిన ర‌ష్మీ.. స‌ర‌సాలు ఎక్కువ‌య్యాయంటూ..

    Chiranjeevi – Salman Khan

    ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటిస్తున్న సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. మూడు పదుల వయసు వచ్చినా… పెళ్లి కాని ఓ అబ్బాయి కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ముందుగా ఈ సినిమాను మార్చి 4న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా వేశారు.

    Ashoka Vanamlo Arjuna Kalyanam

    ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ నుంచి హృద్యమైన మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘ది సోల్ ఆఫ్ రాధేశ్యామ్’గా వచ్చిన వీడియోలోని సంగీతం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిచింది. ఈ చిత్రానికి ప్రభాకరణ్ సంగీతం అందించగా, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. మార్చి 11విడుదలైన ఈ చిత్రం మంచి టాక్తో విజవంతంగా ప్రదర్శితమవుతోంది.

    Also Read: ప‌గ‌డ‌పు ఉంగ‌రం పెట్టిన ప‌వ‌న్‌.. ఇక సీఎం అవ్వ‌డం ఖాయ‌మేనా..?

    Tags