https://oktelugu.com/

Pareshan Twitter Review: పరేషాన్ ట్విట్టర్ రివ్యూ : రిలీజ్ కి ముందే ఆడియన్స్ ను ‘పరేషాన్’ చేస్తోంది

లేటెస్ట్ గా పరేషాన్ మూవీ అదే స్టైల్ లో పక్కా తెలంగాణ యాసలో డైలాగ్స్ ఉంటాయని ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ద్వారా తెలిసింది తెలుస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 2, 2023 / 08:01 AM IST
    Follow us on

    Pareshan Twitter Review: తెలంగాణ కల్చర్ బ్యాగ్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు ఈ మధ్య పుంజుకుంటున్నాయి. మొన్న ఫిదా.. నిన్న జాతి రత్నాలు‌, ఇటీవల రిలీజైన బలగం సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కంటెంట్ ఎలా ఉన్నా తెలంగాణ యాసతో చెప్పే డైలాగులు ఆకట్టుకోవడంతో ప్రతి ఒక్కరు అదే ఫాలో అవుతున్నారు. ఆ మధ్య రిలీజైన జాతి రత్నాలు సినిమాల్లో కంటెంట్ విషయం ఎలా ఉన్నా తెలంగాణ యాసలో చేసిన కామెడీతో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.

    లేటెస్ట్ గా పరేషాన్ మూవీ అదే స్టైల్ లో పక్కా తెలంగాణ యాసలో డైలాగ్స్ ఉంటాయని ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ద్వారా తెలిసింది తెలుస్తుంది. జూన్ 2 న ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది. అయితే ఈ సినిమాను ఒక రోజుకు ముందే హైదరాబాదులో ప్రీమియర్ షో వేశారు. వీటిని చూసిన కొందరు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    మసూద్ అనే మూవీ తో ఫేమస్ అయ్యాడు తిరువీర్. హిలేరియస్ ఎంటర్టైన్మైంట్ గా నా వాలైరు ప్రొడక్షన్ పై సిద్దార్థ రాళ్ళపల్లి నిర్మించిన ఈ మూవీని టాలీవుడ్ హీరో రానా రిలీజ్ చేశారు. రూపక్ రోనాల్డ్ డైరెక్షన్ చేసిన ఏ మూవీ టీజర్ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై హోప్స్ విపరీతంగా పెరిగాయి. పక్కా తెలంగాణ రూరల్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఈ మూవీని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించచే అవకాశం ఉందని చిత్రం యూనిట్ ఓ ప్రమోషన్ కా క్రమంలో తెలిపింది. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోను జూన్ 1న హైదరాబాద్లోని కొన్ని థియేటర్లలో ప్రదర్శించారు.

    ఈ సందర్భంగా దీన్ని చూసిన కొందరు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కొందరు సినిమా బాగుందని ట్విట్ చేయగా.. మరికొందరు అసలు సినిమాలో ఏముంది? అంటూ మెసేజ్ పెట్టారు. ఇంకొందరు అయితే కామెడీ తప్ప అసలు సినిమాలో కొత్తదనం ఏం కనిపించలేదని అంటున్నారు. కానీ మొత్తంగా సినిమాలో తెలంగాణ యాసతో కామెడీ ఆకట్టుకుంటుందని అంటున్నారు. వారు చేసిన ట్రీట్లు ఏ విధంగా ఉన్నాయో మీరే చూడండి.