https://oktelugu.com/

Anushka Shetty: అనుష్క నిర్ణయానికి పేరెంట్స్ షాక్, సన్యాసుల్లో కలిసిపోతుందేమో అని కలవరం.. ఏం జరిగిందంటే?

అనుష్క శెట్టి ప్రొఫెషనల్ గా సక్సెస్. హీరోయిన్ గా ఆమె తిరుగు లేని స్టార్డం అనుభవించారు. అయితే అనుష్క వ్యక్తిగత జీవితంలో కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఆమె వివాహం చేసుకోలేదు. కాగా అనుష్క శెట్టి తీసుకున్న ఒక నిర్ణయం ఆమె పేరెంట్స్ ని తీవ్ర ఆందోళనకు గురి చేసిందట. ఆమె సన్యాసిగా మారిపోతుందని భయపడ్డారట.

Written By:
  • S Reddy
  • , Updated On : November 13, 2024 / 12:58 PM IST

    Anushka Shetty

    Follow us on

    Anushka Shetty: అనుష్క శెట్టి సూపర్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో నాగార్జున హీరో. సోనూ సూద్ కీలక రోల్ చేశాడు. అయేషా టకియా మరొక హీరోయిన్ గా నటించింది. అన్నపూర్ణ స్టూడియోలో సూపర్ మూవీ ఆడిషన్స్ జరిగాయట. అనుష్కను చూసిన వెంటనే నాగార్జున ఎంపిక చేశాడట. ఆమెకు నటనరాదు, ఏమడిగినా తెలియదు అంటుందని పూరి జగన్నాధ్ అన్నారట. నటన రాకపోతే మనం నేర్పుదాం, ఈ అమ్మాయే హీరోయిన్ అని నాగార్జున ఫిక్స్ చేశారట.

    ఆ విధంగా అనుష్క శెట్టి హీరోయిన్ అయ్యింది. హీరోయిన్ కాకముందు అనుష్క జాగ్రఫీ లో డిగ్రీ పొందిందట. జాగ్రఫీ టీచర్ గా కూడా కొన్నాళ్ళు పని చేసిందట. అప్పుడే అనుష్కకు యోగ టీచర్ భరత్ ఠాకూర్ పరిచయం అయ్యాడట. ఆయన సూచనలతో యోగాలో శిక్షణ తీసుకుందట. యోగా వలన తన మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉండేదట. యోగా టీచర్ గా సెటిలైపోవాలని అనుష్క అనుకున్నారట. అయితే అనుష్క నిర్ణయం ఆమె పేరెంట్స్ ని ఆందోళనకు గురి చేసిందట.

    నేను యోగా నేర్చుకుని టీచర్ గా సెటిల్ కావాలని అనుకుంటున్నాను.. అని చెప్పగానే వారు భయపడ్డారట. మా అమ్మాయి సన్యాసినిగా మారిపోతుందేమో అనుకున్నారట. అయితే భరత్ ఠాకూర్ మాత్రం నీవు ఖచ్చితంగా సినిమాల్లోకి వెళతావని అనుష్కతో చెప్పాడట. ఆయన ఊహించినట్లే అనుష్క సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయ్యింది. విక్రమార్కుడు, అరుంధతి చిత్రాలతో అనుష్క స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.

    ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు అనుష్కకు నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చాయి. అనుష్క పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది. కొన్నేళ్లుగా అనుష్క ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఆమె చివరి చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఘాటీ టైటిల్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఇటీవల ఘాటీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయగా ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలు పెంచేసింది.

    ఇక అనుష్క వివాహం చేసుకుంటుందా లేదా అనే సందిగ్ధత కొనసాగుతుంది. నాలుగు పదుల వయసు దాటేయగా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. అనుష్క-ప్రభాస్ రిలేషన్ లో ఉన్నారు. వివాహం చేసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ అవి పుకార్లే అని తేలిపోయింది.