Spirit: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి, ప్రభాస్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటికే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు ఆయనతో సినిమా చేయడానికి పోటీ పడుతున్నారు. కానీ ఆయన మాత్రం చాలా సెలెక్టెడ్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్(Prabhas)…ఆయన చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని బ్రేక్ చేస్తూ ఆయన చేయబోతున్న సినిమాలు సైతం అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టబోతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు లభించబోతుంది అనేది తెలియాల్సి ఉంది…ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఇక దీంతో పాటుగా మారుతి (Maruthi) డైరెక్షన్లో చేసిన రాజసాబ్ (Rajasaab) సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలతో తనను తాను స్టార్ హీరోగా మరోసారి ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో చేయబోతున్న స్పిరిట్ (Spirit) సినిమా తెర మీదకి రాబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అయినప్పటికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న సలార్ (Salaar), కల్కి (Kalki) సినిమాలకు సీక్వెల్ ని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఆయా దర్శకులు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.
మరి ఈ క్రమంలో ఆ రెండు సినిమాల మీద తన డేట్స్ ని కేటాయించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఆటోమెటిగ్గా ఆ రెండు సినిమాలు ముందుకు వస్తే స్పిరిట్ (Spirit) సినిమా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు అనే విషయాల మీద సరైన స్పష్టత అయితే రావడం లేదు.
మరి వీటి మీద క్లియర్ కట్ విజన్ తో ప్రభాస్ ఏ సినిమాకి ఎన్ని డేట్స్ ని కేటాయించాలి అనేది నిర్ణయించుకొని షూటింగ్లో పాల్గొంటూ ముందుకు సాగితే మంచిదని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది…