Panchatantram Movie: ‘పంచతంత్రం’… ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కీలకపాత్రలో స్వాతి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ నటించిన చిత్రం. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ‘పంచతంత్రం’ మూవీ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న బ్రహ్మీ … చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ నటిస్తుండడం విశేషం. ముఖ్యంగా తెలుగు చిత్ర సీమలో సీనియర్ కామెడియన్లు ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా కనిపిస్తున్నారు.
ఈ నేపధ్యంలో బ్రహ్మానందం గారిని ఈ సినిమాలో చూడబోతుండడం ఎంతో ఆనందంగా ఉందని నెటిజలు కామెంట్లు చేస్తున్నారు. ఈ టీజర్ లో అనగనగా ఓ పెద్ద అడవి ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడు, గూడు, తోడు దొరికాక… నాలుగో జీవనాధారం కోసం ఓ చోట కలుసుకున్నాయి. ఆ జీవనాధారమే కథలు, సింహం విసిరిన పంజా కథలు, చిరుత పెట్టిన పరుగు కథలు… ఈగ చెప్పిన బాహుబలి కథలు వినటానికి వచ్చిన వాటికి మైక్ దగ్గర ఓ ముసలి తాబేలు కలిసింది’ అంటూ… సత్యదేవ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ స్పెషల్ అట్ట్రాక్షన్ అని చెప్పవచ్చు.
నిత్యం జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో కథలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Panchatantram movie teaser out now
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com