Panchali Pancha Badruka Movie First Look: ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రాజేంద్రప్రసాద్ గత కొంతకాలం నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇక తన నుంచి పూర్తిస్థాయి కామెడీ సినిమా అయితే ఈ మధ్యకాలంలో రాలేదు. కాబట్టి ఇప్పుడు ‘పాంచాలి పంచ భర్తృక’ అనే సినిమాని చేస్తున్నాడు. తను మెయిల్ లీడ్ లో వస్తున్న ఈ సినిమా పోస్టర్ ను రాజేంద్రప్రసాద్ చేతుల మీదిగానే రిలీజ్ చేశారు. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పోస్టర్ ను చూస్తుంటే అలాగే రాజేంద్రప్రసాద్ కామెడీ తో మరోసారి మనకు చక్కిలిగింతలు పెట్టడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది… ఇక ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ ,వెంకట దుగ్గిరెడ్డి, రాజ్ పవన్, ప్రముఖ రోప్ సింగర్ రోల్ రీడా, జెమిని సురేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నాడు…
వెంకట్ దుగ్గిరెడ్డి ఈ సినిమాను యూఎస్ఏ లో నిర్మిస్తున్నారు… ఇక ఈ సినిమా లెస్ లాజిక్, మోర్ మ్యాజిక్ అనే క్యాప్షన్ తో తెరకెక్కుతోంది…ఈ పోస్టర్ రిలీజ్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సైతం పాల్గొన్నాడు… మహేష్ నారాయణ, బిషెక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి బాబీ కే ఎస్ఆర్ కథను అందించగా, రాజ్ పవన్ స్క్రీన్ ప్లే రాశారు. ఇక దర్శకుడు గంగా సప్త శిఖర వ్యవహరిస్తుండటం విశేషం…

ఇక దర్శకుడు సైతం ఈ మూవీని ఎక్కువ ఫన్ ఉండేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు… ఇక ఈ పోస్టర్ ఈవెంట్ లో భాగంగా రాజేంద్రప్రసాద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో నా పాత్ర ఏంటి అనేది మీరు స్క్రీన్ మీదనే చూడాలి… ఈ మధ్యకాలంలో నేను చేస్తున్న పాత్రలన్నీ రొటీన్ గా అయిపోతున్నాయి.
నేను ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్ ని చేసి చాలా రోజులు అవుతుంది. ఈ సినిమాలో నా నుంచి మీరు అది చూడొచ్చు అంటూ రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో తను చేయబోయే క్యారెక్టర్ కి సంబంధించిన విశేషాలైతే పంచుకున్నాడు… ఇక మొత్తానికైతే వీలైనంత తొందరగా ఈ సినిమా నుంచి ఒక థియేట్రికల్ ట్రైలర్ ని సైతం రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చే ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేయబోతోంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…