
Nawazuddin Siddiqui: భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటులు కొంతమంది ఉంటారు. ఎలాంటి పాత్రని అయినా అలవోకగా చెయ్యగలరు కాబట్టే డైరెక్టర్స్ వీళ్ళ డేట్స్ కోసం వెంటబడుతారు. అలాంటి నటులలో ఒకరు ‘నవాజుద్దీన్ సిద్దిఖీ’. ఈయన తెలుగు లో ఎక్కువగా సినిమాలు చెయ్యలేదు కానీ, తమిళం లో మాత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘పేట’ సినిమాలో విలన్ గా చేసాడు. ఆ చిత్రం ఇక్కడ కూడా డబ్ అయ్యింది.
ఆ విధంగా ఈయన తెలుగు ప్రేక్షహకులకు కూడా సుపరిచితం అయ్యాడు.త్వరలోనే ఆయన డైరెక్టు తెలుగు సినిమా ద్వారా కూడా మరోసారి మన అందరి ముందుకు రాబోతున్నాడు. సుమారుగా 50 కి పైగా సినిమాలలో నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ కి వచ్చినన్ని అవార్డ్స్ మరో బాలీవుడ్ నటుడికి ఇప్పటి వరకు రాలేదని అంటుంటారు. అంత గొప్ప నటుడు ఆయన. కాంట్రవర్సీలకు ఎప్పుడూ దూరంగా ఉంటూ వచ్చే నవాజుద్దీన్ సిద్దిఖీ గత కొంత కాలం నుండి మాజీ భార్య నుండి పలు ఇబ్బందులను ఎదురుకుంటున్నాడు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ తన భార్య అంజనా పాండే తో విడిపోయి చాలా కాలం అయ్యింది. ఆమె తో విడిపోయిన తర్వాత నవాజుద్దీన్ తన కెరీర్ ని తానూ చూసుకుంటూ బిజీ గా గడుపుతున్నాడు. అయితే అంజనా పాండే మాత్రం నవాజుద్దీన్ సిద్దిఖీ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా లో కామెంట్ చెయ్యడమే పనిగా పెట్టుకుంది. కొద్దిరోజులు భరించాడు కానీ, ఆ హద్దులు మీరిపోవడం తో ఆయన కోర్టు లో ఆమె పై పరువు నష్టం దావా వేసాడు.
అంజనా సంసుద్దీన్ అనే వ్యక్తి తో కలిసి తరచూ నా మీద సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటుందని, ఇది నా పరువుకు భంగం అని, తక్షణమే నాకు బహిరంగంగా వాళ్లిద్దరూ క్షమాపణలు చెప్పి, వంద కోట్ల రూపాయిలు పరువు నష్టం దావా చెల్లించాలని ఈ సందర్భంగా నవాజుద్దీన్ సిద్దిఖీ కోర్టు లో కేసు వేసాడు.ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.