https://oktelugu.com/

Vijay Devarakonda: విజయ్ దేవర కొండ కోసం జూనియర్ ఎన్టీఆర్, రణబీర్ కపూర్, సూర్య..వామ్మో ఇదేమి ప్లానింగ్ బాబోయ్!

యంగ్ హీరోస్ లో ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవర కొండ. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ యూత్ ఆడియన్స్ మొత్తాన్ని తన వైపుకు ఎలా తిప్పుకున్నాడో, ఈ జనరేషన్ లో విజయ్ దేవరకొండ అలా మారిపోయాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం,టాక్సీ వాలా, పెళ్లి చూపులు వంటి సూపర్ హిట్ సినిమాలను అందుకున్న విజయ్ దేవరకొండ, ఈమధ్య కాలం లో చేసిన ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : February 8, 2025 / 08:40 PM IST
    Follow us on

    Vijay Devarakonda: యంగ్ హీరోస్ లో ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవర కొండ. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ యూత్ ఆడియన్స్ మొత్తాన్ని తన వైపుకు ఎలా తిప్పుకున్నాడో, ఈ జనరేషన్ లో విజయ్ దేవరకొండ అలా మారిపోయాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం,టాక్సీ వాలా, పెళ్లి చూపులు వంటి సూపర్ హిట్ సినిమాలను అందుకున్న విజయ్ దేవరకొండ, ఈమధ్య కాలం లో చేసిన ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. భారీ ఆశలు పెట్టుకున్న ‘లైగర్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ఇక తనతో ‘గీత గోవిందం’ లాంటి సూపర్ హిట్ ని అందించిన పరశురామ్ తో ‘ది ఫ్యామిలీ స్టార్’ అనే చిత్రం చేస్తే అది కూడా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆయన ఆశలన్నీ గౌతమ్ తిన్ననూరి తో చేస్తున్న సినిమా మీదనే ఉన్నాయి.

    సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ చిత్రానికి సామ్రాజ్యం అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఫిబ్రవరి 12 న ఈ సినిమా టైటిల్ టీజర్ ని విడుదల చేయబోతున్నారు. ఈ టైటిల్ టీజర్ కి తెలుగు లో జూనియర్ ఎన్టీఆర్, హిందీ లో రణబీర్ కపూర్, తమిళం లో సూర్య వాయిస్ ఓవర్ అందించబోతున్నారట. కేవలం టైటిల్ టీజర్ కి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్లానింగ్ చేస్తున్నారంటే, సినిమా ని ఏ రేంజ్ లో తీస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ ని ఆడియన్స్ కలలో కూడా ఊహించని క్యారక్టర్ లో కనపడబోతున్నాడట. విజయ్ ని మీడియం రేంజ్ హీరో నుండి స్టార్ లీగ్ లోకి తీసుకెళ్లే విధంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తయారైంది అట.

    ఇందులో హీరోయిన్స్ గా మీనాక్షి చౌదరి, భాగ్యశ్రీ భోర్సే నటిస్తున్నారు. మొదట్లో భాగ్యశ్రీ బదులుగా శ్రీలీల ని తీసుకున్నారు కానీ, ఆ తర్వాత ఆమె అందుబాటులో లేకపోవడంతో భాగ్యశ్రీ ని ఎంచుకున్నారు. మిస్టర్ బచ్చన్ చిత్రం తో ఈమె ఇండస్ట్రీ కి పరిచయమైనా సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ భాగ్యశ్రీ అందంగా ఉండడంతో ఆమెకు ఈ సినిమాలో వెంటనే అవకాశం అందించారు. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. విజయ్ దేవరకొండ కి అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ ఉండడం తో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు ఉంటాయని ట్రేడ్ వర్గాలు బలమైన నమ్మకం పెట్టుకుంది. మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.