https://oktelugu.com/

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ పోస్టర్ మీద సంచలన కమిట్ చేసిన పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తెలుగు సినిమా అంటే ఒకప్పుడు చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు సినిమానే ఇండియన్ సినిమాగా మారిపోయింది. మన స్టార్ హీరోలు, యంగ్ హీరోలు వరుసగా మంచి కథలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ భారీ వసూళ్లను రాబడుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 3, 2024 / 02:27 PM IST

    Vijay Deverakonda

    Follow us on

    Vijay Deverakonda: పెళ్లి చూపులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరో విజయ్ దేవరకొండ…ప్రస్తుతం ఆయన వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇంతకు ముందు అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో మంచి స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ లను కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక అందులో భాగంగా జెర్సీ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ‘గౌతమ్ తిన్ననూరి’ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ మూవీలో ఆయన చాలా రగ్గుడ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ ను కనక మనం చూసినట్లయితే అందులో ఆయన చాలా రగ్గుడ్ లుక్ లో కనిపించడమే కాకుండా చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తనకంటే వెనకాల వచ్చిన హీరోలు సైతం ఇప్పుడు ఈజీగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ వందల కోట్ల కలెక్షన్లను రాబడుతుంటే విజయ్ మాత్రం అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమా తర్వాత ఆశించిన సక్సెస్ ను సాధించలేకపోతున్నాడు. ఇక తన ప్లాపులకు ఈ సినిమాలతో పులిస్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది..

    ఈ పోస్టర్ పైన అర్జున్ రెడ్డి డైరెక్టర్ అయిన ‘సందీప్ రెడ్డి వంగ’ స్పందిస్తూ ఈ లుక్ లో ‘దేవరకొండ విజయ్ సాయి’ అద్భుతంగా ఉన్నాడు అంటూ ట్వీట్ చేశాడు. ఇక ప్రస్తుతం ఆ ట్వీట్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో వైరల్ గా మారింది. ఇక మొత్తానికైతే విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక భారీ హిట్టు సాధించడానికి సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ కొడితేనే విజయ్ దేవరకొండ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ను చూపించుకుంటాడు.

    ఇక లేకపోతే మాత్రం తనకంటే వెనకాల ఉన్న హీరోలు కూడా తనని దాటి ముందుకు దూసుకెళ్లే ప్రమాదమైతే ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడు ఎలాగైనా భారీ సక్సెస్ ని కొట్టి తీరాలి. లేకపోతే మాత్రం భారీగా వెనుకబడిపోవడం ఖాయం… ఇక రీసెంట్ గా పరుశురాం దర్శకత్వంలో వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా భారీ ఫ్లాప్ గా మిగలడంతో ఆయనకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక పూరి డైరెక్షన్ లో వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ అవ్వడం తో ఆ సినిమా నుంచే ఆయన డౌన్ ఫాల్ అయితే స్టార్ట్ అయింది.

    ఇక ఫ్యామిలీ స్టార్ తో ఆ ప్లాప్ ల పరంపర కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో చేస్తున్న సినిమా మొదట రామ్ చరణ్ చేయాల్సింది. కానీ రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాకి కమిట్ అవ్వడంతో ఈ సినిమా లేట్ అవుతుందనే అనుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాని విజయ్ దేవరకొండ తో చేస్తున్నాడు. ఇక బేసిగ్గా ఈ సినిమా ప్లాట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అంటూ అప్పట్లో వార్తలైతే వచ్చాయి…