Pushpa: అరెరే.. ‘పుష్ప’లో ఆ కళ మిస్ అయిందే !

Pushpa: పుష్ప పేరులోనే మంచి హోమ్లీ నెస్ ఉంది. అందుకే, ‘పుష్ప’ అనగానే చాలామంది ఈ చిత్రం పై తెగ ఆసక్తి చూపించారు. అయితే, ఇక్కడే పొరపాటు జరిగింది. పుష్పను పాన్ ఇండియా స్థాయిలో తీసుకురాబోతున్నాం అంటూ మేకర్స్ తెగ హడావిడి చేశారు. ఆ స్థాయి అంటే.. మరీ బడ్జెట్ సమస్య కదా..? అందుకే, ఏ గొడవ లేకుండా రెండు భాగాలుగా సినిమాని సిద్ధం చేశారు. గట్టిగా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. పైగా అల్లు అర్జున్ కెరీర్ […]

Written By: Shiva, Updated On : December 7, 2021 6:55 pm
Follow us on

Pushpa: పుష్ప పేరులోనే మంచి హోమ్లీ నెస్ ఉంది. అందుకే, ‘పుష్ప’ అనగానే చాలామంది ఈ చిత్రం పై తెగ ఆసక్తి చూపించారు. అయితే, ఇక్కడే పొరపాటు జరిగింది. పుష్పను పాన్ ఇండియా స్థాయిలో తీసుకురాబోతున్నాం అంటూ మేకర్స్ తెగ హడావిడి చేశారు. ఆ స్థాయి అంటే.. మరీ బడ్జెట్ సమస్య కదా..? అందుకే, ఏ గొడవ లేకుండా రెండు భాగాలుగా సినిమాని సిద్ధం చేశారు.

Pushpa

గట్టిగా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. పైగా అల్లు అర్జున్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా “పుష్ప” రూపుదిద్దుకుంటుంది అంటూ సినిమాని బాగా ప్రమోట్ చేశారు. తెలుగులో వరకు బాగానే నడిచింది. కానీ, పాన్ ఇండియా లెవల్ ప్రమోషన్స్ లోనే పుష్పకు అడుగడుగునా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఉదాహరణకు ట్రైలర్ విషయానికి వద్దాం.

ముందు విడుదల తేదీ, టైమ్ ప్రకారం.. ట్రైలర్ ను రిలీజ్ చేయలేకపోయారు. అసలు చిన్న ట్రైలర్ విషయంలోనే జరిగిన జాప్యత కారణంగా సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో చిన్న చూపు ఏర్పడింది. అసలు, ట్రైలర్ ను కూడా చెప్పిన సమయానికి రిలీజ్ చేయలేని మేకర్స్.. ఇక జాతీయ స్థాయిలో సినిమాని అలరించే విధంగా ఎలా తీసుకురాగలరు ? హిందీ బయ్యర్లు అడుగుతున్న ప్రశ్న ఇది.

దీనికితోడు ఈ సినిమా హిందీ ట్రైలర్ ను ఇంకా రిలీజ్ చేయలేదు. ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్ ప్రకారం ట్రైలర్ లో మ్యాటర్ లేదు అంటున్నారు. మ్యాటర్ అంటే.. తెలుగు ప్రేక్షకులకు బన్నీ స్టార్ హీరో. మరి హిందీ ప్రేక్షకులకు బన్నీ ఎవరో కూడా సరిగ్గా తెలియదు. ఊరు పేరు తెలియని హీరో యాక్షన్ చేస్తుంటే.. మనం ఎందుకు ఆసక్తి చూపిస్తాం.

Also Read: Nithya Menon: త్రివిక్రమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి నిత్యా మీనన్…

సేమ్ హిందీ జనాలు కూడా అంతే. అందుకే హిందీ ట్రైలర్ విషయంలో చిత్ర యూనిట్ లో టెన్షన్ వాతావరణం ఎక్కువవుతోంది. హిందీ జనానికి ట్రైలర్ ఎక్కదు ఏమో అని టీమ్ లోనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హిందీలో కూడా “పుష్ప” హంగామా ఉంటుందంటూ చిత్ర యూనిట్ ఆ మధ్య అధికారికంగా గొప్పలు పోయింది.

మరి ఇప్పుడు, ట్రైలర్ రిలీజ్ అయ్యాక, బాలీవుడ్ నాట పుష్ప డీలా పడితే ఎలా ? పరువు పోదు. అసలుకే పుష్ప లేత ప్రాయంలో ఉంది. అంటే.. మొదటి భాగం అని అర్థం. ఇప్పుడే పుష్ప పై మచ్చలు పడితే.. ఇక వయసు పెరిగాక, అదే రెండో భాగం విడుదల అయ్యాక, బాక్సాఫీస్ వద్ద నిలబడడం కష్టమే. అందుకే, పుష్పలో పాన్ ఇండియా కళ మిస్ అయిందని చిత్రబృందమే ఆలోచనలో పడింది.

Also Read: Shriya Saran: నేను మళ్ళీ ఎలా షేప్ లోకి వచ్చానంటే.. ?

Tags