https://oktelugu.com/

Nithya Menon: త్రివిక్రమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి నిత్యా మీనన్…

Nithya Menon: బాల న‌టిగా కెరీర్ మొద‌లు పెట్టి అన‌తి కాలంలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నిత్యా మీన‌న్‌. నాని హీరోగా న‌టించిన అలా మొద‌లైంది చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ చిన్న‌ది తొలి సినిమాతోనే ఆక‌ట్టుకున్నారు. కేవ‌లం త‌న న‌ట‌న‌తోనే కాకుండా గాత్రంతోనూ ఆక‌ట్టుకున్న నిత్యా.. అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నారు. న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌కు మాత్ర‌మే ఓకే చెబుతూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవ‌లి కాలంలో నిత్యా సినిమాల్లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 06:37 PM IST
    Follow us on

    Nithya Menon: బాల న‌టిగా కెరీర్ మొద‌లు పెట్టి అన‌తి కాలంలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నిత్యా మీన‌న్‌. నాని హీరోగా న‌టించిన అలా మొద‌లైంది చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ చిన్న‌ది తొలి సినిమాతోనే ఆక‌ట్టుకున్నారు. కేవ‌లం త‌న న‌ట‌న‌తోనే కాకుండా గాత్రంతోనూ ఆక‌ట్టుకున్న నిత్యా.. అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నారు. న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌కు మాత్ర‌మే ఓకే చెబుతూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవ‌లి కాలంలో నిత్యా సినిమాల్లో క‌నిపించ‌డం కాస్త త‌గ్గించింది. తెలుగులో చివ‌రిగా “నిన్నిలా నిన్నిలా” మూవీలో న‌టించింది. ఆ త‌ర్వాత మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. మళ్ళీ ఇప్పుడు వరుస సినిమాలతో జోరు పెంచింది ఈ భామ.

    actress nithya menon interesting comments about director trivikram

    Also Read: విడాకుల అనంతరం మొదటిసారి తన మనసులో మాట చెప్పిన సమంత…

    ఇక ఇటీవల ‘స్కైలాబ్’ చిత్రంతో నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం నిత్యా ‘భీమ్లా నాయక్’ లో పవన్ కళ్యాణ్ భార్యగా నటిస్తోంది. తాజాగా ఆమె ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకోంది. ” నా అంతట నేనుగా ఎవరి దగ్గరకు వెళ్లి అవకాశాల కోసం నిలబడను. ఆ పాత్రకు నేను సరిపోతాను అని అనుకున్నవారు నా దగ్గరకు వచ్చి అడుగుతారు. ‘భీమ్లా నాయక్’ కూడా నాకు అలా వచ్చిందే అని చెప్పింది నిత్య. కాగా త్రివిక్రమ్ తనకు ముందు నుంచి తెలుసని నన్ను ఒక రౌడీ అమ్మాయిలా చూస్తారు అని వెల్లడించింది. అందుకే సన్నాఫ్ సత్యమూర్తి, భీమ్లా నాయక్ చిత్రాల్లో అలాంటి పాత్రను ఇచ్చారు అంటూ వెల్లడించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేయనున్నారు.

    Also Read: నేను మళ్ళీ ఎలా షేప్ లోకి వచ్చానంటే.. ?