https://oktelugu.com/

Rajamouli: రాజమౌళి కారణంగానే పవన్ ను పోటీలోకి దించుతున్నాడు !

Rajamouli: సితార ఎంటర్ టైన్మెంట్స్ నాగవంశీకి ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా నాగవంశీ, ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఈ విషయం గురించి నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో చాలా ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. తన బ్లడ్ లోనే నందమూరి అభిమానం ఉందని. మంచి గుర్తింపు ఉన్న నిర్మాణ సంస్థ వారసుడి నుంచి ఇలాంటి మాట వస్తోందని ఎవరూ ఊహించలేదు. కానీ, నాగవంశీ చాలా ఓపెన్ గా చెప్పేశాడు. ఎన్టీఆర్ కోసం తానూ ఏమైనా చేస్తాను అంటూ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 7, 2021 / 06:52 PM IST
    Follow us on

    Rajamouli: సితార ఎంటర్ టైన్మెంట్స్ నాగవంశీకి ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా నాగవంశీ, ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఈ విషయం గురించి నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో చాలా ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. తన బ్లడ్ లోనే నందమూరి అభిమానం ఉందని. మంచి గుర్తింపు ఉన్న నిర్మాణ సంస్థ వారసుడి నుంచి ఇలాంటి మాట వస్తోందని ఎవరూ ఊహించలేదు. కానీ, నాగవంశీ చాలా ఓపెన్ గా చెప్పేశాడు.

    Bheemla Nayak

    ఎన్టీఆర్ కోసం తానూ ఏమైనా చేస్తాను అంటూ నాగవంశీ మాట్లాడుకుంటూ పోయాడు. ఇదంతా బాగానే ఉంది. ప్రస్తుతానికి వద్దాం. ఎన్టీఆర్ -చరణ్ హీరోలుగా “ఆర్ఆర్ఆర్” సినిమా జనవరి 7వ తేదీన భారీ స్థాయిలో నేషనల్ రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా పై ఉన్న అంచనాల కారణంగా కనీసం ఈ చిత్రానికి రెండు వారలు పాటు థియేటర్స్ కావాలి.

    అందుకే, చిత్రబృందం కూడా సంక్రాంతికి వారం ముందుగానే సినిమాని థియేటర్స్ లోకి వదులుతుంది. పైగా మిగిలిన స్టార్ హీరోలను రిక్వెస్ట్ చేసుకుని.. తమ సినిమాకి పోటీ లేకుండా చూసుకుంటుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా తన ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని పోస్ట్ ఫోన్ చేసుకున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నాగవంశీ నిర్మాణంలో వస్తున్న సినిమా “భీమ్లా నాయక్”.

    ఈ సినిమా కూడా పోస్ట్ ఫోన్ అవుతుందని అందరూ ఊహించారు. రాజమౌళి కూడా ఈ చిత్రాన్ని పోస్ట్ ఫోన్ చేయాల్సిందిగా పవన్ ను కోరితే.. రిలీజ్ అనేది తనకు సంబంధం లేని మ్యాటర్ అని, నిర్మాతతో మాట్లాడుకోండి అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక నాగవంశీ ఎలాగూ ఎన్టీఆర్ అభిమాని కాబట్టి.. రాజమౌళి లైట్ తీసుకున్నాడు.

    సినిమాని పోస్ట్ ఫోన్ చేసుకోవాల్సిందిగా తన మేనేజర్ తో కబురు పంపాడు. మరి అలా తనను తక్కువ అంచనా వేశారని, నాగవంశీ ఫీల్ అయ్యాడో, లేక మరేదైనా కారణమో తెలియదు గానీ, “భీమ్లా నాయక్” రిలీజ్ విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదు. ‘భీమ్లా నాయక్’ రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వచ్చిన ప్రతిసారి.. “భీమ్లా నాయక్” రిలీజ్ ఉంటుంది అంటూ నాగవంశీ ట్వీట్ చేస్తూ వస్తున్నాడు.

    Also Read: Shriya Saran: నేను మళ్ళీ ఎలా షేప్ లోకి వచ్చానంటే.. ?

    తాజాగా మళ్ళీ “భీమ్లా నాయక్” రిలీజ్ పై నాగవంశీ ట్వీట్ చేస్తూ.. ‘లాల్ భీమ్లా’ రష్ ఇప్పుడే చూడటం జరిగింది. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన థియేటర్స్ లో బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉండండి’ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులకు పిలుపునిచ్చాడు. మొత్తానికి తన అభిమాన హీరోకి పోటీగా పవన్ ను దించుతున్నాడు నాగవంశీ. మొత్తమ్మీద రాజమౌళి, నాగవంశీ ఇగో హర్ట్ చేశాడు.

    Also Read: Nithya Menon: త్రివిక్రమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి నిత్యా మీనన్…

    Tags