https://oktelugu.com/

Pallavi Prashanth: సామాన్యుల పొట్టకొట్టిన పల్లవి ప్రశాంత్..ఇంతటి అన్యాయం మరొకటి ఉండదు!

శివాజీ లేని పల్లవి ప్రశాంత్ ని ఊహించడం చాలా కష్టమే, పల్లవి ప్రశాంత్ లోని మరో మనిషిని జనాలకి తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డాడు శివాజీ. ఇక పల్లవి ప్రశాంత్ బయటకి వచ్చిన తర్వాత అతని తీరుని మనమంతా చూసాము.

Written By:
  • Vicky
  • , Updated On : August 10, 2024 / 05:10 PM IST

    Pallavi Prashanth

    Follow us on

    Pallavi Prashanth: స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్స్ అన్నీ ఒక ఎత్తు, గత ఏడాది ప్రసారమైన సీజన్ మరో ఎత్తు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ సీజన్ అన్నీ సీజన్స్ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కేవలం టీవీ టెలికాస్ట్ లో మాత్రమే కాదు , హాట్ స్టార్ లో కూడా గత సీజన్ కి ఆల్ టైం రికార్డు వ్యూస్ వచ్చాయి. ఆ సీజన్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణం కేవలం ముగ్గురు. వారు అమర్ దీప్, శివాజీ మరియు పల్లవి ప్రశాంత్. సామాన్యుడు, రైతు బిడ్డ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచి సంచలనం సృష్టించాడు. ఒక సామాన్యుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవ్వడం ఇదే తొలిసారి.

    అయితే అతను అలా గెలవడానికి శివాజీ ఎంతో కృషి చేసాడు. శివాజీ లేని పల్లవి ప్రశాంత్ ని ఊహించడం చాలా కష్టమే, పల్లవి ప్రశాంత్ లోని మరో మనిషిని జనాలకి తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డాడు శివాజీ. ఇక పల్లవి ప్రశాంత్ బయటకి వచ్చిన తర్వాత అతని తీరుని మనమంతా చూసాము. బిగ్ బాస్ గెలిచిన ప్రతీ పైసా ని రైతులకు మాత్రమే ఉపయోగిస్తాను అని చెప్పిన పల్లవి ప్రశాంత్, కేవలం లక్ష రూపాయిల సహాయం చేసి చేతులు దులుపుకున్నాడు. దీని గురించి మీడియా వారు ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతో ఆయన ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఇదంతా పక్కన పెడితే శివాజీ పదే పదే సామాన్యుడు, రైతు బిడ్డ అనే ట్యాగ్స్ ని ఉపయోగిస్తూ, సామాన్యుడిని అవమానించాడు, రైతు బిడ్డ అంటే అమర్ దీప్ కి చిన్న చూపు అంటూ ప్రచారం చేసి, జనాల్లో వ్యతిరేక భావాన్ని పెంచాడు. ఎంతలా అంటే అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత అతని మీద దాడి చేసేంతలా.

    దీనిపై పోలీసులు కూడా బిగ్ బాస్ యాజమాన్యం పై చాలా ఫైర్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ కూడా చేసారు. దీంతో బిగ్ బాస్ యాజమాన్యం ఇక సామాన్యులని తమ షో లో తీసుకోరాదని ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ తీసుకుంటే పల్లవి ప్రశాంత్ విషయం లో జరిగినదే, మళ్ళీ జరిగే అవకాశం ఉంటుందని, ఈసారి అలాంటి పొరపాటు జరిగితే పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ యాజమాన్యం భావించిందట. ప్రతీ సామాన్యుడికి సెలబ్రిటీ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీ లోకి వెళ్ళాలి అనే చిన్నపాటి కోరిక ఉంటుంది, అది సహజం. పల్లవి ప్రశాంత్ అలాంటి కోరికలు ఉన్న సామాన్యుల పొట్టని కొట్టినట్టే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 నుండి స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కానుంది.