Sobhita Naga Chaitanya Engagement: టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో నాగచైతన్య, సమంత ఒకరు. ఏమాయ చేశావో సినిమాతో పరిచయమైన వీళ్లు ప్రేమించి 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల విడిపోతున్నట్లు ఈ జంట 2021లో ప్రకటించింది. అప్పటి నుంచే వీరి ఫ్యాన్స్ బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. క్యూట్ కపుల్ విడిపోవడం తమకు నచ్చట్లేదన్నారు. ఏది ఏమైనా ఇద్దరు కలిసి ఉంటే బాగుండని ఫ్యాన్స్ ఆరాటపడ్డారు. అయితే విడాకుల తర్వాత కూడా ఇద్దరు మళ్లీ వేరే రిలేషన్‌లోకి వెళ్లకపోవడం వల్ల మళ్లీ కలుస్తారు ఏమో అని చాలామంది భావించారు. కానీ తాజాగా చైతన్య ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో వీళ్లు మళ్లీ కలుస్తారనే ఆశలు ఆవిరయ్యాయి. విడాకుల తీసుకున్న మూడేళ్ల తర్వాత చైతన్య శోభిత దూళిపాళ్లతో పెళ్లికి సిద్ధమయ్యారు. దీంతో సమంత, చైతూ మళ్లీ కలవడం కష్టమేనని, ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప ఇద్దరు మళ్లీ కలవరని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడిపోయిన తర్వాత అందరూ సమంతను తప్పుపట్టారు. ఐటమ్ సాంగ్స్ చేయడం, బోల్డ్ సీన్స్ చేయడం, తన మేకప్ ఆర్టిస్ట్‌తో రిలేషన్ పెట్టుకోవడం వల్లే ఇద్దరు విడిపోయారని ఆ మధ్యకాలంలో బాగా రూమర్స్ వచ్చాయి. చైతన్య కంటే సమంత ముందుగా పెళ్లికి సిద్ధమై ఉంటే సమంత తప్పు వల్లే విడిపోయారని అందరూ ఫిక్స్ అయ్యేవాళ్లు. కానీ సమంత కంటే నాగచైతన్య ముందు పెళ్లికి రెడీ కావడంతో ఈ రూమర్స్‌కి చెక్ పడింది. అప్పట్లో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల డేటింగ్‌లో ఉన్నారని, ఇద్దరూ కలిసి వెకేషన్స్‌కి వెళ్లారని రూమర్స్ వచ్చాయి. అయితే సమంతతో విడాకుల తర్వాత వీరిద్దరూ రిలేషన్‌లోకి వెళ్లారా? లేదా శోభితతో రిలేషన్‌లో ఉండటం వల్ల ఇద్దరూ విడిపోయారా? అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నగానే ఉంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వల్ల సమంత, నాగచైతన్య విడిపోయారని గతంలో వార్తలు వచ్చాయి. మరి వీటిలో నిజమెంత ఇప్పటికీ తెలియదు.
నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ జరుగుతుందని నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించవచ్చని ముందుగానే మీడియాలో వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే నాగార్జున ప్రకటించడంతో సోషల్ మీడియా మొత్తం సమంతకు సపోర్ట్ చేస్తూ పోస్టులు చేశారు. మొత్తం సమంత, నాగచైతన్య, శోభిత గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. గతంలో సమంత చెప్పినట్లే జరిగిందని, అప్పుడు ఎవరూ సమంతను నమ్మలేదని ఫ్యాన్స్ సమంతకు సపోర్ట్ చేస్తున్నారు. బోల్డ్ సీన్స్ చేస్తుందనే కారణంతోనే సమంతను వదిలేశారని.. మరి శోభిత కూడా అంతకు మించి బోల్డ్ సీన్స్ చేస్తుందని ఫ్యాన్స్ చైతూపై ఫైర్ అవుతున్నారు. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలిసిన కారణాలు. కానీ వీరిద్దరి మధ్య అసలు ఎలాంటి విభేధాలు వచ్చాయి? ఎందుకు వీడిపోయారనేది కరెక్ట్‌గా ఎవరికీ తెలియదు. చైతూ శ్యామ్‌ను వదిలేయకపోవాల్సిందని.. వీరిద్దరికి సంబంధించిన వీడియోలను ఫ్యాన్స్ రీక్రియేట్ చేస్తున్నారు. అయితే సిని పరిశ్రమలో ప్రేమించి వివాహం చేసుకోవడం తర్వాత విడిపోవడం ఒక ట్రెండ్ అయిపోయింది. సీక్రెట్‌గా ప్రేమించి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్న ఆ సంతోషం ఎన్నాళ్లు ఉండటం లేదు. ఈ మధ్యకాలంలో చాలా జంటలు వ్యక్తిగత కారణాలతో విడాకుల బాట పడుతున్నారు. ఇదిలా ఉండగా సమంత, నాగచైతన్య విడిపోతారని గతంలో వేణుస్వామి చెప్పిన వార్తలు వైరల్ అయ్యాయి. మళ్లీ నాగచైతన్య, శోభిత కూడా 2027లో విడిపోతారని చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే 2027 వరకు వేచిచూడాలి.
ఇదిలా ఉండగా దొరికిందే ఛాన్స్ అని మీడియా వాళ్లు సమంత, చైతన్య, శోభితపై పగబట్టారు. ఎందుకు విడిపోయారు? ఎవరిది తప్పు? నిజనిజాలు తెలుసుకోకుండా నచ్చినట్లుగా వార్తలు రాస్తున్నారు. కొందరు సమంతను టార్గెట్ చేస్తూ మరికొందరు చైతూను, ఇంకొందరు శోభితను టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌కు ఇప్పటివరకు చాలామంది బలయ్యారు. అలాగే వీళ్లు ముగ్గురు కూడా ఈ వార్తలకు ఇప్పుడు బలవుతున్నారు. తన తల్లికి జరిగిన ఘటనను సమంతకు చైతూ రిపిట్ చేశాడని కొందరు చైతూపై మండిపడుతున్నారు. వాళ్ల మధ్యలో ఏం జరిగిందని ఎవరికీ తెలియదు. కానీ సోషల్ మీడియా ట్రోల్స్‌కు ముగ్గురు బలవుతున్నారు. అసలు నిజనిజాలు తెలుసుకోకుండా సమంత, చైతన్య, శోభితలతో మీడియా మూడు ముక్కలాడుతుంది. ఏ న్యూస్ లేకపోవడం వల్ల వీళ్లను ట్రోల్ చేస్తున్నారా? లేక? టీఆర్‌పీ రేటింగ్ కోసమా? పూర్తి వివరాలు తెలియకుండా వీళ్ల వ్యక్తిగత విషయాల్లో మీడియా చొరబడి అంగడిలో పెడుతుంది. ఇకనైనా వ్యక్తిగత విషయాల్లో చొరబడి మీడియా గ్యాసిప్స్ సృష్టించడం తగ్గించాలి.