Pallavi Prashanth: బిగ్ బాస్ హౌజ్ లోకి రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతున్నాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ కు వెళ్లేందుకు తాను చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. చాలా కష్టపడ్డాడు పల్లవి ప్రశాంత్. మొత్తం మీద అనుకున్న కల నెరవేరి లోపలకి వెళ్లాక చెలరేగిపోతున్నాడు. ముందుగా రతిక వలలో పడిన ప్రశాంత్ ఆ తర్వాత శివాజీ మాటలు విని కాస్త తన ఆట తాను ఆడడం మొదలు పెట్టాడు. ఒకరి చేతిలో కీలుబొమ్మ కాకుండా వెంటనే భయటపడ్డాడు ఈ రైతు బిడ్డ.
ఎప్పుడైతే ఫ్రీడం వచ్చేసిందో..అప్పటి నుంచి అతనికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఏ టాస్క్ ఇచ్చినా సరే చీల్చి చెండాటమే పనిగా పెట్టుకున్నాడు. శివాజీ సలహాలతో టాప్ కంటెస్టెంట్‌గా రాటు దేలాడు. ఇలా ఆటే ధ్యేయంగా ఆడుతున్న ప్రశాంత్ సీజన్ 7లో తొలి కెప్టెన్ గా నిలిచాడు.అయితే ముందుగా ఈయనను అందరూ తక్కువ చేసి చూసిన మాట వాస్తవే. అందరికంటే ఎక్కువగా ఆ సీరియల్ బ్యాచ్ మరీ తక్కువ చేసి చూసింది. ఒక రకంగా చెప్పాలంటే వారి మాటలే అతడిని హీరోని చేశాయి. రెండు ముఖాలు.. రెండు ముఖాలు అన్నవారు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకోవాలనే తెలియని పరిస్థితి. ప్రశాంత్ నామినేషన్ లో ఉంటే చాలు ఆయన కోసం ఓటింగ్ వేయడానికి జనాలు, ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంత రేంజ్ వచ్చేసింది పల్లవి ప్రశాంత్ కు…
అయితే కొంతమంది బయట ప్రశాంత్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్లకి చాలా పొలం ఉందని.. కోటీశ్వర్లు అని వార్తలు సర్కులేట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రచారాన్ని తప్పు పట్టారు పల్లవి ప్రశాంత్ పేరెంట్స్. తమకి కేవలం 6 ఎకరాలు పొలం మాత్రమే ఉందని వెల్లడించారు. నాలుగు కార్లు ఉన్నాయి అంటున్నారని.. తమకు ఒక కారు కూడా లేదన్నారు. పొలం దున్నుకునేందుకు ఓ ట్రాక్టర్ మాత్రం ఉందని చెప్పుకొచ్చారు. కొంతమంది కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ద్వారా సంపాదించిన డబ్బును పేద రైతులకు ఇస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే. ఈయన మాటలు విన్న తల్లిదండ్రి చాలా సంతోషించారు. ఇదే విషయాన్ని తెలిపారు కూడా. అమర్ దీప్ తమ బిడ్డను తిట్టడం మాత్రం తమ మనసును కలిచివేసిందని పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ తెలిపారు. 13 ఏళ్ల నుంచి ప్రశాంత్ వ్యవసాయ పనులు చేసేవాడని.. కొందరు ఫ్రెండ్స్ అతడిని మోసం చేశారని వెల్లడించారు. ఆ ఇంట్లో శివాజీ తమ బిడ్డను కాపాడుతూ తనకు సపోర్ట్ చేయడం మరింత సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు.