https://oktelugu.com/

Pallavi Prashanth: నన్ను సీఎం చేయండి రైతుల కష్టాలన్నీ తీర్చేస్తా… పల్లవి ప్రశాంత్ కోరికలు మామూలుగా లేవుగా! వీడియో వైరల్

విమర్శలకు చెక్ పెడుతూ రీసెంట్ గా ఓ పేద రైతు కుటుంబానికి లక్ష రూపాయలు సహాయం అందించాడు. ఏడాదికి సరిపడా బియ్యం కూడా ఇచ్చాడు.

Written By: , Updated On : March 19, 2024 / 01:51 PM IST
Pallavi Prashanth about Politics

Pallavi Prashanth about Politics

Follow us on

Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఓ సెన్సేషన్. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్ లో అడుగుపెట్టాడు. అదే సింపతీ వర్కౌట్ చేసి ఏకంగా టైటిల్ గెలిచాడు. పల్లవి ప్రశాంత్ ఆట తీరు కూడా జనాలను మెస్మరైజ్ చేసింది. పైగా తనకు వచ్చిన ప్రతి ఒక్క రూపాయి రైతుల కోసం ఖర్చు చేస్తానంటూ ప్రశాంత్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ అయిపోయి మూడు నెలలు గడుస్తున్నా .. ప్రశాంత్ ఆ ఊసే ఎత్తకపోవడం తో అతని పై విమర్శలు వచ్చాయి. ఇచ్చిన మాట సంగతి ఏంటి అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.

ఈ విమర్శలకు చెక్ పెడుతూ రీసెంట్ గా ఓ పేద రైతు కుటుంబానికి లక్ష రూపాయలు సహాయం అందించాడు. ఏడాదికి సరిపడా బియ్యం కూడా ఇచ్చాడు. సందీప్ మాస్టర్ రూ. 25,000 ఆ రైతు కుటుంబానికి తన వంతు సహాయం చేశాడు. ఈ సందర్భంగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ఈ నేపథ్యంలో ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నన్ను సీఎం ని చేస్తే రైతులందరిని ఆదుకుంటా అంటూ ప్రశాంత్ కామెంట్స్ చేశాడు. నేను సీఎం అయితేనే రైతులు బాగుపడతారు అని వ్యాఖ్యానించాడు.

ప్రశాంత్ మాట్లాడుతూ .. రైతులందరిని ఆదుకునే దమ్ము సీఎం కి ఉంటుంది. నన్ను సీఎం ని చేస్తే నేను ఆదుకుంటా అని చెప్పా .. తప్పా అన్న. 14 ఊర్లు అంటే మామూలు విషయమా, నాకు వచ్చింది ఎంత?. రూపాయి వస్తే ఆ రూపాయిని 14 ఊర్లకు ఎట్ల పంచుతాను. ఒకవేళ ఇస్తే అంతిచ్చిండు, ఇంతిచ్చిండు అంటారు. అట్లా కాకుండా నన్ను సీఎం ని చేస్తే అందరిని ఆదుకుంటా కదా అని చెప్పుకొచ్చాడు.

యువత మేల్కోవాలి .. యువత ముందుకు వస్తే రైతులు బాగుపడతారు అని పల్లవి ప్రశాంత్ తెలిపాడు. తనకు డబ్బు లేట్ గా వచ్చిందని .. అందుకే పంచడం ఆలస్యం అయిందని వెల్లడించారు. కాగా పల్లవి ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు పల్లవి ప్రశాంత్ ని ట్రోల్ చేస్తున్నారు. సీఎం చేయడం ఏమిటంటూ ఎద్దేవా చేస్తున్నారు.