Pallavi Prashanth
Pallavi Prashanth: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ యాంకర్ శివ ల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది మరింత ముదిరింది. కాగా పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తానని ఇంటికి పిలిచి గంటల కొద్ది వెయిట్ చేయించాడు. తీరా ఇంటర్వ్యూ ఇవ్వకుండా దారుణంగా అవమానించాడని కొన్ని యూట్యూబర్స్ నెగిటివ్ ప్రచారం చేశాయి. ఈ క్రమంలో యాంకర్ శివ పల్లవి ప్రశాంత్ పై విమర్శలు చేశాడు.
ప్రశాంత్ ఇంటర్వ్యూ ఇస్తానని ఇంటికి పిలిచి .. దారుణంగా అవమానించాడు, బూతులు తిట్టాడు అని వీడియోలు రిలీజ్ చేసాడు. యాంకర్ శివ తో పాటు చాలా మంది యూట్యూబర్స్ కి పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దీంతో ప్రశాంత్ ని తిడుతూ నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. అయితే ప్రశాంత్ అరెస్ట్ కి ముందు కూడా తనని కొందరు కావాలనే నెగిటివ్ చేస్తున్నారు .. వారి పేర్లు బయట పెడతాను అని చెప్పాడు. కాగా అరెస్ట్ అయిన 48 గంటల్లోనే ప్రశాంత్ కు బెయిల్ లభించింది.
నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేసిన యాంకర్ శివ తో పాటు .. కొందరు యూట్యూబర్స్ పై ప్రశాంత్ పరువు నష్టం దావా వేసేందుకు నిర్ణయించుకున్నాడు. బెయిల్ నిమిత్తం తనను కలిసిన లాయర్లతో మాట్లాడి ప్రశాంత్ … తన పై నెగిటివ్ ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేయబోతున్నాడట. ప్రశాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ విషయాన్ని తెలియజేశారు.
దాదాపు 50 మంది లాయర్లు అతని తరపున వాదించడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు వారిలో చాలా మంది ప్రశాంత్ పై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై పరువు నష్టం దావా వేయడానికి పేపర్ వర్క్ స్టార్ట్ చేశారట. అయితే ఈ విషయంపై ప్రశాంత్ ముందే హెచ్చరించాడు. కొంత మంది నోటికొచ్చినట్టు నాపై ప్రచారం చేస్తున్నారు. నాకేమైనా అయితే వాళ్ళ పేర్లు బయట పెడతా అన్నాడు. ప్రశాంత్ పరువు నష్టం దావా వేస్తే యాంకర్ శివ కు కష్టాలు తప్పవు.