The Legend Of Maula Jatt Collections: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టిస్టార్రర్ చిత్రం #RRR సృష్టించిన ప్రభంజనం ని ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆ అంచనాలను మించి సునామి ని సృష్టించింది..కేవలం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే కాదు..ప్రపంచ స్థాయి బాక్స్ ఆఫీస్ ని శాసించింది ఈ చిత్రం..అమెరికాలో సుమారుగా 14 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా యునైటెడ్ కింగ్డమ్ (లండన్) లో 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

లండన్ వంటి దేశం లో ఇండియన్ సినిమా 1 మిలియన్ డాలర్స్ వసూలు చెయ్యడం ఇదే తొలిసారి..ఈ సినిమా తర్వాత విడుదలైన KGF చాప్టర్ 2 మరియు బ్రహ్మాస్త్ర సినిమాలు #RRR కలెక్షన్స్ ని దాటేశాయి..ఇప్పుడు #RRR కలెక్షన్స్ ని ఇక్కడ ఒక పాకిస్తానీ సినిమా దాటేసింది..ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారిన అంశం..ఇంతకీ ఆ సినిమా ఏమిటో ఒక లుక్ వేద్దాం.
పాకిస్తాన్ లో ఇటీవలే ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ అనే చిత్రం విడుదలై అక్కడ ప్రభంజనం సృష్టించింది..ఆ సినిమా కేవలం పాకిస్తాన్ లో మాత్రమే కాదు..ఓవర్సీస్ లో కూడా దుమ్ములేపేస్తుంది..ముఖ్యంగా ఈ సినిమా లండన్ లో #RRR కలెక్షన్స్ ని దాటేసిందట..ఫుల్ రన్ లో ఈ చిత్రం 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది..ఇక దీనిపై సోషల్ మీడియా #RRR అభిమానులు చెప్తున్నారు..ఎందుకు దీనిని ఇంత హైలైట్ చేస్తున్నారు..అది దాటింది కేవలం లండన్ లో మాత్రమే..దీనికి ప్రపంచవ్యాప్తంగా #RRR వసూళ్లను దాటేసినట్టు ఎందుకు అతి చేస్తున్నారు అంటూ విరుచుకుపడుతున్నారు.

#RRR సినిమాకి ఇతర దేశాలలో కూడా అద్భుతమైన ఆదరణ లభించిందని..ఆ స్థాయి వసూళ్లను అందుకోవడం ఎవరి తరం కాదని ఈ సందర్భం గా అభిమానులు చెప్తున్నారు..ఇటీవలే ఈ చిత్రాన్ని జపాన్ లో విడుదల చెయ్యగా అక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది..ఈ చిత్రం ఇక్కడ కేవలం పది రోజుల్లోనే 200 జపనీస్ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.