Homeఎంటర్టైన్మెంట్Paagal Review: పాగల్ మూవీ - హిట్టా ? ఫట్టా ?

Paagal Review: పాగల్ మూవీ – హిట్టా ? ఫట్టా ?

YouTube video player

తారాగణం : విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రన్ చౌదరి, మేఘా లేఖ తదితరులు.

దర్శకుడు: నరేష్ కుప్పిలి
సంగీతం:
సినిమాటోగ్రఫీ:
ఎడిటింగ్‌:
నిర్మాత: బెక్కం వేణుగోపాల్, దిల్ రాజు.

యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘పాగల్’ ప్రమోషన్స్‌ లో మాట్లాడిన మాటలు, అలాగే ‘మా సినిమా హిట్’ అంటూ చేసిన హడావుడి, హిట్ కాకపోతే నా పేరు మార్చుకుంటానంటూ ఇచ్చిన స్టేట్ మెంట్స్ బాగా వివాదాస్పదమయ్యాయి. మరి ఈ ‘పాగల్’ ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :

ప్రేమ్ (విశ్వక్ సేన్) చిన్న వయసులోనే తల్లిని కోల్పోతాడు. తల్లిలా ప్రేమించే అమ్మాయి కోసం వెతుకుతాడు. మరి ప్రేమ్ ప్రయత్నంలో అతనికి తారసపడిన అమ్మాయిలు ఎవరు ? వాళ్ళను ఆకర్షించడానికి ప్రేమ్ చేసిన ప్రయత్నాలు ఏమిటి ? ఇంతకీ నేటి డిజిటల్ యుగంలో అతను ఆశించిన లక్షణాలున్న అమ్మాయి దొరికిందా ? దొరికితే ఆ అమ్మాయి కోసం ప్రేమ్ ఏమి చేశాడు ? ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

పాగల్ విషయంలో విశ్వక్ సేన్ చెప్పిన మాటలకు, సినిమాలో అసలు మ్యాటర్ కు పొంతన లేదు. సినిమా కాన్సెప్ట్ లోనే సినిమాటిక్ టోన్ ఎక్కువ అవ్వడం, అలాగే సినిమాలో ల్యాగ్ అండ్ ఓవర్ మెలోడ్రామాతో పాటు విసిగించే ఫేక్ ఎమోషన్స్ సినిమాకి బాగా మైనస్ అయ్యాయి. అయినా, హీరో 1600 మంది అమ్మాయిలను ప్రేమించాలనుకోవడం ఏమిటో ? పైగా తల్లిలా ప్రేమించే అమ్మాయి కోసం వెతకాలనుకోవడానికి అసలు సరైన మోటివ్ ఏమిటో ? దర్శకుడికే క్లారిటీ మిస్ అయింది.

అయితే, విశ్వక్ సేన్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉండటంతో.. సినిమాకి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. పైగా టార్గెట్ ప్రేక్షకులు సినిమాలో కొన్ని అంశాలను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే విశ్వక్ సేన్ కూడా తన బాడీ లాంగ్వేజ్ తో, మరియు తన మాడ్యులేషన్ తో బాగా ఆకట్టుకున్నాడు. నటన విషయంలో పెట్టిన ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. పైగా గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో విశ్వక్ సేన్ కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు.

సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరో హీరోయిన్ల మధ్య సీన్లు, వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. హీరోయిన్స్ గా నటించిన నివేదా పేతురాజ్, సిమ్రన్ చౌదరి, మేఘా లేఖ తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తమ గ్లామర్ తోనూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నివేదా పేతురాజ్ తన నటనతో బాగా మెప్పించింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

అయితే, దర్శకుడు నరేష్ కుప్పిలి ప్లే బాయ్ క్యారెక్టరైజేషన్ కి ఎమోషనల్ టచ్ ఇచ్చినా అది వర్కౌట్ అవ్వలేదు. స్టోరీ లైన్ అయితే బాగుంది, కానీ స్క్రీన్ ప్లేలో ఉన్న లోపాలు కారణంగా సినిమా స్లోగా సాగింది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో హీరోయిన్, హీరోన్ని రిజెక్ట్ చేసే సన్నివేశాలను, హీరో ప్రేమలో పడే సన్నివేశాలను ఇంకా బాగా రాసుకుని ఉండాల్సింది. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. పాటలు పర్వాలేదనిపస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ నటన,

మెయిన్ పాయింట్, కొన్ని కామెడీ సీన్స్,

కొన్ని బోల్డ్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

స్లోగా సాగే స్క్రీన్ ప్లే,

ఇంట్రెస్టింగ్ కంటెంట్ లేకపోవడం,

సినిమాటిక్ టోన్ ఎక్కువ అవ్వడం,

పాత్రల పరిచయ సన్నివేశాలు,

ఓవర్ బిల్డప్ షాట్స్,

హీరో లవ్ ట్రాక్స్.

సినిమా చూడాలా ? వద్దా ? :

భిన్నమైన కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘పాగల్’ వైవిధ్యంగా లేకపోయినా.. కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆకట్టుకుంది. అయితే, గ్రిప్పింగ్ నరేషన్ లేకపోవడం, కథలో సహజత్వం మిస్ అవ్వడం, స్లో నేరేషన్ వంటి అంశాలు బాగాలేదు. కానీ టార్గెట్ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చుతుంది. కాకపోతే యూత్ తప్ప, మిగిలిన వర్గాల ప్రేక్షకులు ఈ కరోనా సమయంలో థియేటర్ కి వెళ్లి ఈ సినిమాని చూడకపోవడమే మంచింది.

రేటింగ్ 2.5

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version