Homeఎంటర్టైన్మెంట్Vishwak Sen : ఇచ్చిన బిల్డప్ కి భారీ ఎఫెక్ట్ తగిలింది !

Vishwak Sen : ఇచ్చిన బిల్డప్ కి భారీ ఎఫెక్ట్ తగిలింది !

‘మాస్‌ కా బాప్‌’ అంటూ మొదటి సినిమాతోనే టాలెంటెడ్ హీరో అనిపించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే అదృష్టం కూడా కలిసి వచ్చింది. రెండో సినిమాకి డైరెక్షన్ చేస్తే అది మంచి హిట్ అయింది. దానికి తోడు మూడో సినిమాకి నాని నిర్మాత. అది కూడా హిటే. మొత్తానికి నాలుగో సినిమాకి మంచి బజ్ వచ్చింది. పాగల్ అనగానే కుర్రాళ్లు థియేటర్స్ మీద ఎగబడ్డారు. కట్ చేస్తే.. అసలుకే మోసం జరిగింది. ఈ మధ్య కాలంలో పాగల్ కి వచ్చిన […]

Paagal Movie

‘మాస్‌ కా బాప్‌’ అంటూ మొదటి సినిమాతోనే టాలెంటెడ్ హీరో అనిపించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే అదృష్టం కూడా కలిసి వచ్చింది. రెండో సినిమాకి డైరెక్షన్ చేస్తే అది మంచి హిట్ అయింది. దానికి తోడు మూడో సినిమాకి నాని నిర్మాత. అది కూడా హిటే. మొత్తానికి నాలుగో సినిమాకి మంచి బజ్ వచ్చింది. పాగల్ అనగానే కుర్రాళ్లు థియేటర్స్ మీద ఎగబడ్డారు.

కట్ చేస్తే.. అసలుకే మోసం జరిగింది. ఈ మధ్య కాలంలో పాగల్ కి వచ్చిన బజ్ మరో ఏ సినిమాకి రాలేదు. టైటిల్ లోనే బోల్డ్ కంటెంట్ ఉండటంతో సినిమా జనంలోకి బాగా వెళ్ళింది. కానీ కథాకథనాల్లో ఎలాంటి కొత్తదనం చూపించకుండా.. భిన్నమైన ఎమోషనల్ డ్రామా అంటూ ప్రేక్షకుడిని విసిగించి వదిలిపెట్టాడు విశ్వక్‌సేన్.

లవర్‌ బాయ్‌ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చాను అంటూ సినీ ప్రియులకు బోరింగ్ లవ్ స్టోరీ చూపించాడు. పాపం విశ్వక్‌సేన్ ‘నన్ను సపోర్ట్‌ చేయండి, మా సినిమా ప్రయత్నంలో మీకు ఏదైనా చిన్న లోపం కనిపిస్తే పెద్ద మనసుతో ఆదరించండి’ అని అన్నప్పుడే సినిమా అవుట్ ఫుట్ మీద డౌట్ పడాల్సింది అంటూ బయ్యర్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.

మొత్తమ్మీద పాగల్ ప్లాప్ అని తేలిపోయింది. మధ్యాహ్నం షోకి థియేటర్స్‌ ఖాళీ అయిపోయాయి. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చిన ‘నాకు మీరే అండ.. దండ’ అంటూ విశ్వక్‌ ఎమోషనల్ టచ్ ఇవ్వాలనుకుంటే.. ఈ హీరోకి ప్రేక్షకులు షాకింగ్ ఇచ్చేలా ఉన్నారు. ఏది ఏమైనా సినిమా పై నెగిటివ్ టాక్ ఎక్కువైపోయింది.

సినిమాలో ఓవర్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు బోరింగ్ ప్లే సినిమా ఫలితాన్ని దెబ్బ తీసిందట. ఈ సినిమా గనుక హిట్ అయి ఉంటే.. మొత్తానికి విశ్వక్‌ స్టార్ అయ్యే వాడు. కానీ ఆ అవకాశాన్ని విశ్వక్‌ చెడగొట్టుకున్నాడు. ఇచ్చిన బిల్డప్ కి భారీ ఎఫెక్ట్ తగిలింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper