https://oktelugu.com/

‘బిగ్ బాస్’లో ఓవర్ ఎమోషన్.. ‘వంటలక్క’ను మించి..! 

బిగ్ బాస్-4 ప్రస్తుతం 11వ వారానికి చేరుకుంది. ఈ షో చివరి దశకు చేరుకోనుండటంతో గేమ్ ఆసక్తికరంగా మారింది. అయితే పదోవారం ఎలిమినేషన్ సందర్భంగా కంటెస్టులు చేసిన ఓవర్ యాక్షన్ చూసి ప్రేక్షకులు తలలుపట్టుకుంటున్నారు. ఒకరిని మించి ఒకరు ఓవర్ ఎమోషన్ చూపిస్తూ ఏడుపులు.. పెడబొబ్బలు పెట్టడం బిగ్ బాస్ అభిమానులకు ఒకింత చిరాకు తెప్పించినట్లు తెలుస్తోంది. Also Read: ‘బిగ్ బాస్’నే ఇరుకున పెడుతున్న కంటెస్టెంట్లు..! బిగ్ బాస్ రియల్టీ షోలో ప్రతీవారం హౌస్ నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2020 / 12:22 PM IST
    Follow us on


    బిగ్ బాస్-4 ప్రస్తుతం 11వ వారానికి చేరుకుంది. ఈ షో చివరి దశకు చేరుకోనుండటంతో గేమ్ ఆసక్తికరంగా మారింది. అయితే పదోవారం ఎలిమినేషన్ సందర్భంగా కంటెస్టులు చేసిన ఓవర్ యాక్షన్ చూసి ప్రేక్షకులు తలలుపట్టుకుంటున్నారు. ఒకరిని మించి ఒకరు ఓవర్ ఎమోషన్ చూపిస్తూ ఏడుపులు.. పెడబొబ్బలు పెట్టడం బిగ్ బాస్ అభిమానులకు ఒకింత చిరాకు తెప్పించినట్లు తెలుస్తోంది.

    Also Read: ‘బిగ్ బాస్’నే ఇరుకున పెడుతున్న కంటెస్టెంట్లు..!

    బిగ్ బాస్ రియల్టీ షోలో ప్రతీవారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కావడం కామన్ అనేది అందరికీ తెల్సిందే. అయితే బిగ్ బాస్ నుంచి ఎవరైనా కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే మిగతావాళ్లు ఒకింత బాధపడటం సహజమే. అయితే బిగ్ బాస్-4లో పదో వారం ఎలిమినేషన్ మొత్తంగా ఏడుపులు.. పెడబొబ్బలతో సాగింది.

    10వ ఎలిమినేషన్లో భాగంగా మోహబూబ్ ఎలిమినేషన్ అయినట్లు హోస్టు నాగార్జున ప్రకటించాడు. అయితే హౌస్ నుంచి ఎలిమినేట్ అయితే జీవితం నుంచి శాశ్వతంగా ఎలిమినేట్ అయినట్లు మిగతా కంటెస్టులు ఓవర్ ఎమోషన్ చూపించడం ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. ఎలిమినేట్ అయిన మోహబూబ్ కు తోడు సోహైల్ ఏడువడం మొదలు పెట్టాడు.

    Also Read: బిగ్ బాస్-4: ఈవారం హౌస్ నుంచి వెళ్లేది అతడేనా?

    హౌస్ లో ఏడుపులు.. పెడబొబ్బలు పూర్తయ్యాక నాగార్జున వద్దకు వెళ్లిన మోహబూబ్ అక్కడ కూడా ఎమోషనల్ అయ్యాడు. హౌసులోని ఒక్కొక్క‌రి గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. సోహైల్ ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి ఏమీ మాట్లాడ‌లేక నేల‌కు కొడుతూ ఏవేవో చేశాడు. మెహ‌బూబ్ ఎమోషన్ కు మ‌రోసారి సోహైల్ మాట‌లు, ఏడ్పు జ‌త క‌లిశాయి. చివర్లో మోహబూబ్ ఓ హిందీ పాటకు భావోద్వేగంతో కూడిన డాన్స్ చేసి బిగ్ బాస్ నుంచి సెలవు తీసుకున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఈ వారం బిగ్ బాస్ చూసిన వారందరికీ ‘కార్తీకదీపం’ సీరియల్ గుర్తుకురాక తప్పదు. ఇందులో దీప(వంటలక్క) తన ఏడుపుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సీరియల్ టీఆర్పీలో దూసుకెళుతుంది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా వంటలక్కను ఫాలోవడంపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఎంటట్మైనెంట్ చేయకపోయిన పర్వాలేదుగానీ ఈ అతిని మాత్రం భరించలేమ్ బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.