జగిత్యాల జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. అయితే శవాలు కుళ్లిపోయిన వాసన రావడంతో చాలా రోజుల కిందటే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని హైదర్ పల్లి లో కుళ్లిన శవాల వాసన రావడంతో చుట్టపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఓ ఇంటి తలుపులు తెరిచేసరికి ఉరివేసుకొని ఉన్న మృత దేహాలు లభ్యమయ్యాయి. అయితే మృతి చెందిన యువకుడు నలువాల మధుగా గుర్తించారు. ఆయన జగిత్యాలలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే మరో అమ్మాయి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. వీరిద్దరు కలిసి ఉరివేసుకోవడంతో ప్రేమికులనే అనుకుంటున్నారు.