https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు విసిరిన OU జేఏసీ నాయకులు..ఫ్యాన్స్ కి వణుకుపుట్టిస్తున్న లేటెస్ట్ వీడియో!

నేడు ఉస్మానియా యూనివర్సిటీ కి సంబంధించిన జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటి ని ముట్టడించి, ఆ ఇంటి పై రాళ్లతో దాడి చేసిన ఘటన, ఆ ఘటన కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 22, 2024 / 06:31 PM IST

    Allu Arjun(10)

    Follow us on

    Allu Arjun: హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన చిలికి చిలికి గాలి వాన అయ్యేట్టు ఉంది. ఈ ఘటనపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో వివరణ ఇస్తూ అల్లు అర్జున్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడం, దానికి సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి తన క్యారక్టర్ ని దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పడం వంటివి హాట్ టాపిక్ గా మారింది. అయితే అల్లు అర్జున్ రేవతి కుటుంబాన్ని ఆదుకుంటాను అని ప్రమాదం జరిగిన మరుసటి రోజే అధికారికంగా వీడియో ద్వారా తెలిపాడు, సక్సెస్ మీట్ లో కూడా ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం పై కోర్టు లో కేసు నడుస్తుంది, కేసు వేసింది రేవతి భర్త కాబట్టి, వాళ్ళని చట్ట ప్రకారం అల్లు అర్జున్ కలిసేందుకు వీలు లేదు. అందుకే తనకి బదులుగా తన తండ్రి అల్లు అరవింద్ ని శ్రీతేజ్ వద్దకు పంపాడు.

    అయితే నేడు ఉస్మానియా యూనివర్సిటీ కి సంబంధించిన జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటి ని ముట్టడించి, ఆ ఇంటి పై రాళ్లతో దాడి చేసిన ఘటన, ఆ ఘటన కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ శ్రీ తేజ్ ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు నిరసన తెలిపిన ఒక రకం, కానీ ఆ అబ్బాయి చికిత్స కి అయ్యే ఖర్చు, అదే విధంగా పాతిక లక్షల రూపాయిల విరాళం అల్లు అర్జున్ ప్రకటించినప్పటికీ కూడా జేఏసీ నాయకులు ఇలా అమానవీయంగా అల్లు అర్జున్ ఇంటి పై రాళ్లు విసరడం అన్యాయం, అమానుషం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక వీడియో చూస్తుంటేనే మనకి భయం వేస్తుంది. అంత దారుణంగా ప్రవర్తించారు.

    ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవాళ్లు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ఇంత దారుణంగా రౌడీ మూకలు వచ్చి రాళ్లతో దాడి చేస్తే వాళ్ళు ఎంతలా భయభ్రాంతులకు గురి అవుతారో ఆ స్థితిలో మనముంటే తెలుస్తుంది. సోషల్ మీడియా లో కొంతమంది అల్లు అర్జున్ దురాభిమానులు అతనికి మంచి పని అయ్యింది అంటూ రాక్షసానందం తో పోస్టులు వేస్తున్నారు. ఇది నిజంగా మంచి పద్దతి కాదు. ఇలాంటివి ప్రోత్సహిస్తే ఈరోజు అల్లు అర్జున్ కి జరిగిన ఘటన రేపు మీ ఇంట్లో కూడా జరగొచ్చు. దయచేసి ఇలాంటి సున్నితమైన అంశాలలో మానవత్వం చూపించండి అంటూ సోషల్ మీడియా లో సీనియర్ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై అల్లు అర్జున్ రియాక్ట్ అవుతాడా లేదా?, తన ఇంటికి పోలీసుల అవసరం కచ్చితంగా ఉంది. దీనిని సీరియస్ గా తీసుకోకుంటే జనాలు ప్రభుత్వం పై తిరగబడే అవకాశాలు ఉన్నాయి.