https://oktelugu.com/

Anushka Shetty: ఎన్టీఆర్, చరణ్ లతో అనుష్క ఒక్క సినిమా కూడా చేయలేదు, కానీ వీరిద్దరిలో ఆమె కోరుకున్న హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో జతకట్టిన అనుష్క.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఒక్క సినిమా కూడా చేయలేదు. అందుకు కారణం ఎమిటో తెలియదు. కాగా అనుష్కకు ఒక సందర్భంలో వీరిద్దరితో నటించే ఛాన్స్ వస్తే.. నీ ఛాయిస్ ఎవరనే ప్రశ్న ఎదురైంది. అనుష్క ఎవరి పేరు చెప్పిందో తెలుసా?

Written By:
  • Gopi
  • , Updated On : December 22, 2024 / 06:26 PM IST

    Anushka Shetty

    Follow us on

    Anushka Shetty: అనుష్క శెట్టి సూపర్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. 2005లో సూపర్ విడుదలైంది. ఈ సినిమా ఆడిషన్స్ కి హాజరైన అనుష్కను చూసిన నాగార్జున… దర్శకుడు పూరికి ఆమెను ఎంపిక చేయమని సలహా ఇచ్చాడట. నటనలో పెద్దగా అనుభవం లేకున్నా.. అనుష్కకు తన గ్లామర్, హైట్, గుడ్ లుకింగ్ పర్సనాలిటీ అవకాశం తెచ్చిపెట్టింది. సూపర్ మూవీ ఓ మోస్తరు విజయం అందుకుంది. విక్రమార్కుడు, అరుంధతి, బిల్లా చిత్రాలతో అనుష్క టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అవతరించింది.

    ప్రభాస్ కి జంటగా అనుష్క అత్యధికంగా నాలుగు సినిమాలు చేసింది. వీరి కాంబోలో వచ్చిన బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు భారీ విజయాలు అందుకున్నాయి. కాగా అనుష్క ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో నటించలేదు. పొడవుగా ఉండే అనుష్క వీరి పక్కన సెట్ కాదనే నమ్మకం దర్శక నిర్మాతల్లో ఉందని అంటారు. అల్లు అర్జున్ తో కూడా ఆమె రొమాన్స్ చేయలేదు. వేదం మూవీలో వీరిద్దరూ నటించినప్పటికీ.. ఒకరితో మరొకరికి సంబంధం లేని పాత్రలు చేశారు. లవ్, రొమాన్స్ గట్రా ఉండవు.

    చెప్పాలంటే టాలీవుడ్ కురచ హీరోలతో అనుష్క నటించలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఆమెకు రాలేదు. ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ, గోపీచంద్, సుమంత్, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ లతో ఆమె కలిసి నటించారు. వీరందరూ పొడుగు హీరోలే. కొంచెం హైట్ తక్కువ ఉండే బాలకృష్ణతో కూడా అనుష్క స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరి కాంబోలో ఒక్క మగాడు చిత్రం తెరకెక్కింది. ఇది అతి పెద్ద డిజాస్టర్.

    గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్కకు ఒక ప్రశ్న ఎదురైంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాల్లో ఏక కాలంలో ఆఫర్ వస్తే నీ ఛాయిస్ ఎవరని అడగ్గా… ఆమె ఎన్టీఆర్ కి ఓటు వేసింది. ఎన్టీఆర్ తో మూవీ చేసేందుకు ఒప్పుకుంటాను అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో నీ కెరీర్లో బెస్ట్.. వరస్ట్ మూవీ ఏమిటో చెప్పాలని కోరగా.. అరుంధతి వేదం.. నాకు నచ్చిన చిత్రాలు. ఒక్క మగాడు నచ్చని చిత్రం అన్నారు. ఒక్క మగాడు మూవీకి వైవిఎస్ చౌదరి దర్శకుడు. భారతీయుడు షేడ్స్ లో తెరకెక్కిన ఈ మూవీ అభాసుపాలైంది.