https://oktelugu.com/

ఓటీటీలో మరో రెండు సినిమాలు.. హిట్టయ్యేనా?

కరోనా క్రైసిస్ తో గత ఆరేడు నెలలుగా థియేటర్లు మూతపడటం ఓటీటీలకు కలిసొచ్చింది. ఇటీవలే థియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనల వల్ల థియేటర్ల యజమానులకు నిర్వహణ ఖర్చులు కూడా వచ్చేలా లేకపోవడంతో వాటిని ఓపెన్ చేసేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపడం లేదు. Also Read: టీజర్ టాక్.. అంధురాలిగా నయన్.. సస్సెన్స్ థిల్లర్ గా ‘నెట్రికాన్’..! దీనికితోడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2020 / 03:07 PM IST
    Follow us on

    కరోనా క్రైసిస్ తో గత ఆరేడు నెలలుగా థియేటర్లు మూతపడటం ఓటీటీలకు కలిసొచ్చింది. ఇటీవలే థియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనల వల్ల థియేటర్ల యజమానులకు నిర్వహణ ఖర్చులు కూడా వచ్చేలా లేకపోవడంతో వాటిని ఓపెన్ చేసేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపడం లేదు.

    Also Read: టీజర్ టాక్.. అంధురాలిగా నయన్.. సస్సెన్స్ థిల్లర్ గా ‘నెట్రికాన్’..!

    దీనికితోడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లు వెళ్లి సినిమా చూడాలంటేనే జంకుతున్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా ఓటీటీలకే కలిసి వస్తున్నాయి. ఈక్రమంలోనే థియేటర్లు ఓపెన్ అయినప్పటికీ ఓటీటీల్లో కొత్త సినిమాల హవా తగ్గడం లేదు. అయితే ఓటీటీల్లో రిలీజవుతున్న సినిమాలన్నీ కూడా ప్లాప్ తెచ్చుకుండటం గమనార్హం.

    ఓటీటీల్లో గత ఆరేడు నెలలుగా చాలా కొత్త సినిమాలు విడుదలయ్యాయి. చిన్న.. పెద్ద అనే తేడా లేకుండా ఓటీటీ నిర్వాహాకులు నిర్మాతలకు మంచి ధరను చెల్లించి ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలన్నీ కూడా వారికి ఆశించిన లాభాలను అందించకపోవడంతో ఓటీటీ నిర్వాహకులు ప్రస్తుతం పే ఫర్ వ్యూస్ పేరిట సినిమాకు డబ్బులు చెల్లిస్తున్నారు.

    Also Read: టీజర్ టాక్.. బోల్డ్ కంటెంట్ తో ఆకట్టుకున్న ‘కమిట్ మెంట్’

    గతవారం ఓటీటీలో ఆకాశం నీ హద్దురా.. మా వింత గాధ వినుమా సినిమాలు రిలీజు అయ్యాయి. ఇందులో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా.. సిద్ధూ నటించిన మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత నయనతార నటించిన అమ్మోరు తల్లి రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

    తాజాగా ఈ వారం కూడా మరో రెండు సినిమాలు రిలీజు కానున్నాయి. వీటిలో ఒకటి పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ చేసిన ‘అనగనగా ఓ అతిథి’..  రెండోది ఆనంద్ దేవరకొండ నటించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’. ఈనెల 20న అమెజాన్ ప్రైమ్ లో ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ రానుండగా.. ఆహా ఓటీటీలో పాయల్ మూవీ రాబోతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    అమెజాన్లో ఆకాశం నీ హద్దురా వంటి హిట్ మూవీ రాగా ఆహాలో ఇప్పటివరకు సరైన హిట్ మూవీ రాలేదు. ఆహాలో విడుదలైన సినిమాలన్నీ ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో పాయల్ మూవీ అయినా ‘ఆహా’కు కలిసి వస్తుందని నిర్వాహకులు ఆశలు పెట్టుకున్నారు. ఈ రెండింటిలో ఏ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుందో వేచిచూడాల్సిందే..!