https://oktelugu.com/

టీఆర్ఎస్ కు వరద బాధితుల ముప్పు..!

హైదరాబాద్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ హైదరాబాద్ లో గులాబీ జెండాను ఎగురవేయడానికి తహతహలాడుతోంది. అయితే టీఆర్ఎస్ పార్టీకి వరదబాధితుల రూపంలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. నగరంలోని పలుచోట్ల ప్రచారానికి వెళ్లిని ఎమ్మెల్యేలు, ఇతర కార్పొరేటర్లను స్థానికులు నిలదీయడంతో ఎన్నికల్లో ఈ ప్రభావం ఎంతమేరకు పడుతుందోనని టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. Also Read: ‘బస్తీ’మే సవాల్.. రంగంలోకి కేసీఆర్..వ్యూహాత్మకమేనా? గత కొన్ని రోజుల కిందట […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2020 / 03:10 PM IST
    Follow us on


    హైదరాబాద్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ హైదరాబాద్ లో గులాబీ జెండాను ఎగురవేయడానికి తహతహలాడుతోంది. అయితే టీఆర్ఎస్ పార్టీకి వరదబాధితుల రూపంలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. నగరంలోని పలుచోట్ల ప్రచారానికి వెళ్లిని ఎమ్మెల్యేలు, ఇతర కార్పొరేటర్లను స్థానికులు నిలదీయడంతో ఎన్నికల్లో ఈ ప్రభావం ఎంతమేరకు పడుతుందోనని టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

    Also Read: ‘బస్తీ’మే సవాల్.. రంగంలోకి కేసీఆర్..వ్యూహాత్మకమేనా?

    గత కొన్ని రోజుల కిందట హైదరాబాద్ లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొందరు వరదలకు కొట్టుకొని పోయారు. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.550 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి ఇంటికి రూ. 10 వేల సాయం అందిస్తామని తెలిపింది. అయితే ఈ వరదసాయంలో కొందరు టీఆర్ఎస్ నాయకులు చేతి వాటం చూపించారు. కొన్ని చోట్ల మొత్తానికే రూ. 10 వేలు అందించకపోగా.. మరి కొన్నిచోట్ల రూ. 5000 మాత్రమే పంపిణీ చేసినట్లు స్థానికులు ఆందోళన చేశారు.

    ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం వరదసాయాన్ని నిలిపి వేసింది. అయితే మధ్యలో దుబ్బాక ఎన్నిక రావడంతో వరదసాయం గురించి ఎవరూ మాట్లాడలేదు. ఈ ఘటనను దుబ్బాకలో బీజేపీ ప్రస్తావించడంతో టీఆర్ఎస్ పై కొంత ప్రభావం చూపింది. ఫలితంగా దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి చెందింది.   ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరదసాయం ప్రభావం చూపుతుందోనని స్థానిక టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.

    Also Read: కేసీఆర్ 10వేల సాయం.. పోటెత్తిన జనం

    ఇటీవల రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరద బాధితులు రూ. 10వేల సాయం కోసం మీ సేవ సెంటర్లలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అయితే మీసేవ కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. కొన్ని చోట్ల సర్వర్లు పనిచేయకపోవడం, తదితర కారణాలతో నిజమైన లబ్ధిదారులకు సాయం అందడం లేదు. దీంతో ఆయా డివిజన్లలోకి వెళ్లిన టీఆర్ఎస్ నాయకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చెప్పు చూపడం చర్చనీయాంశంగా మారింది.

    వరదసాయం పంపిణీలో అవకతవకలను గుర్తించి మీ సేవ ద్వరా రూ. 10వేలు అందించాలని చూసినా లబ్ధిదారులు టీఆర్ఎస్ ను దుమ్మెత్తి పోస్తున్నారు. పైగా ఈ సాయం ఇంటి ఓనర్లకు మాత్రమే ఇస్తున్నారని, అద్దెకు ఉన్నవారిని పట్టించుకోవడం లేదని ధర్నాలకు దిగుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో వదర బాధితుల నుంచి టీఆర్ఎస్ ఎలా గట్టెక్కిస్తుందో చూడాలి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్