Tillu Square OTT: ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన టిల్లు స్క్వేర్ అతిపెద్ద సెన్సేషన్. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. 2022లో విడుదలైన డీజే టిల్లు చిత్రానికి టిల్లు స్క్వేర్ సీక్వెల్. హీరో సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు గాడిగా మరోసారి మ్యాజిక్ చేశాడు. సిద్ధూ జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్, మేనరిజమ్స్ యూత్ కి తెగ నచ్చేశాయి. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న టిల్లు స్క్వేర్ రికార్డు వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ టిల్లు స్క్వేర్ రూ. 125 కోట్లకు పైగా కొల్లగొట్టింది. యూఎస్ లో ఊహించని రెస్పాన్స్ దక్కింది. ఏకంగా $3 మిలియన్ వసూలు చేసింది.
మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ నెల రోజులు గడవక ముందే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారంఏప్రిల్ 26 నుండి టిల్లు స్క్వేర్ స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీ ప్రియులకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు. టిల్లు స్క్వేర్ మరోసారి చూసి కుడుపుబ్బా నవ్వొచ్చన్న మాట.
ఇక టిల్లు స్క్వేర్ కి ఓటీటీ రెస్పాన్స్ అనేది తెలియాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఓటీటీ ఆడియన్స్ టిల్లు స్క్వేర్ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుస్తుంది. థియేటర్స్ లో గొప్పగా ఆడిన సినిమాలు ఓటీటీలో ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో కనీస ఆదరణకు నోచుకోని సినిమాలు ఓటీటీలో విపరీతమైన ఆదరణ దక్కించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
సిద్ధూ జొన్నలగడ్డకు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. మాలిక్ రామ్ దర్శకత్వం వహించాడు. టిల్లు స్క్వేర్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. టిల్లు స్క్వేర్ కథ విషయానికి వస్తే.. టిల్లు(సిద్ధూ)కి లిల్లీ(అనుపమ) ఓ పార్టీలో అనుకోకుండా పరిచయం అవుతుంది. మొదటి పరిచయంలోనే ఇద్దరూ ఒక్కటి అవుతారు. తెల్లారేసరికి లిల్లీ లెటర్ పెట్టి వెళ్ళిపోతుంది. పిచ్చివాడైన టిల్లు ఆమె కోసం వేట మొదలుపెడతాడు. అసలు లిల్లీ ఎవరు? టిల్లు జీవితాల్లోకి ఎందుకు వచ్చింది? అనేది మిగతా కథ…
Web Title: Tillu square is streaming on ott platform and how is the response
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com