https://oktelugu.com/

OTT Releases This Week: విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ఓటీటీలో… ఈ వారం అందుబాటులోకి వచ్చిన అద్భుతమైన సినిమాలు, సిరీస్లు ఇవే!

ప్రతి వారం ఓటిట్లో రిలీజ్ అయ్యే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వీకెండ్ కూడా కొన్ని క్రేజీ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పటినుంచో ఊరిస్తున్న ఇండియన్ 2 థియేటర్స్ లో సందడి చేస్తుంది. జులై 12న భారతీయుడు 2 వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల చేశారు. 1996లో విడుదలైన బ్లాక్ బస్టర్ భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్.

Written By:
  • S Reddy
  • , Updated On : July 13, 2024 / 12:22 PM IST

    OTT Releases This Week

    Follow us on

    OTT Releases This Week: వీకెండ్ వచ్చిందంటే చాలు అటు థియేటర్స్ లో ఇటు ఓటిటీలో సినిమాల సందడి మాములుగా ఉండదు. ఎప్పటిలానే ఈ వారం ఓటీటీల్లో కొత్త సినిమాలు. వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాయి. మారిన ప్రేక్షకుల అభిరుచి రీత్యా… థియేటర్ లో కంటే ఓటీటీలో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కంటెంట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు. వారికి నచ్చిన సిరీస్లు హాయిగా ఇంట్లోనే కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

    ప్రతి వారం ఓటిట్లో రిలీజ్ అయ్యే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వీకెండ్ కూడా కొన్ని క్రేజీ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పటినుంచో ఊరిస్తున్న ఇండియన్ 2 థియేటర్స్ లో సందడి చేస్తుంది. జులై 12న భారతీయుడు 2 వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల చేశారు. 1996లో విడుదలైన బ్లాక్ బస్టర్ భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. కమల్ హాసన్ మరోసారి సేనాపతిగా ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. భారతీయుడు 2 చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడం ఊహించని పరిణామం.

    భారతీయుడు 2 ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. భారతీయుడు 3 తీయాలనే నెపంతో దర్శకుడు శంకర్ కథను అసంపూర్తిగా చెప్పడం దెబ్బేసింది. భారతీయుడు సినిమా మాదిరి పార్ట్ 2 ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదని ఆడియన్స్ అభిప్రాయం. భారతీయుడు 2 డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మూవీకి నెగిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో 4-5 వారాల్లో ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది.

    భారతీయుడు 2 తో పాటు సారంగదరియా అనే ఓ చిన్న సినిమా థియేటర్స్ లో విడుదలైంది. ఇది ఇలా ఉంటే .. ఈ వారం ఓటీటీ రిలీజెస్ ఏంటో. ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయో ఆ వివరాలు తెలుసుకుందాం. విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ మహారాజ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ చిత్రం తమిళ్ లో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగులో కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. ఈ వారం ఓటీటీ లవర్స్ కి మహారాజ బెస్ట్ ఛాయిస్ అనడంలో సందేహం లేదు. మహారాజ చిత్రానికి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. జూన్ 14న విడుదల చేశారు. మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్ ఇతర కీలక రోల్స్ చేశారు.

    నెట్ ఫ్లిక్స్ .. మహారాజ మూవీ – జూలై 12. బ్లేమ్ ది గేమ్ సినిమా – జూలై 12. ఎక్స్ప్లోడింగ్ కిట్టెన్స్ కార్టూన్ సిరీస్ – జూలై 12. హాట్ స్టార్ .. అగ్నిసాక్షి తెలుగు సిరీస్ – జూలై 12. షో టైం వెబ్ సిరీస్ – జూలై 12.

    ఆహా .. జిలేబి సినిమా – జూలై 12.

    జియో సినిమా .. పిల్ హిందీ మూవీ – జూలై 12.

    సోనీ లివ్ .. 36 డేస్ హిందీ వెబ్ సిరీస్ – జూలై 12.

    లయన్స్ గేట్ ప్లే .. డాక్టర్ డెత్ సీజన్ 2 వెబ్ సిరీస్ – జూలై 12.

    మనోరమ మ్యాక్స్ .. మందాకిని మలయాళ మూవీ – జూలై 12. వీటిలో విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ మూవీ ‘ మహారాజ ‘ చాలా ప్రత్యేకం. అలాగే గత ఏడాది ఆగస్టులో విడుదల అయిన జిలేబి ఎట్టకేలకు ఒటీటీలో అడుగుపెట్టింది.