KCR And Jagan: కర్మ ఎవరినీ వదిలి పెట్టదు.. కేసీఆర్-జగన్ ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే!

తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ మాజీ సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇద్దరూ మంచి మిత్రులు. ఆరు నెలల క్రితం వరకు ఇద్దరూ చెరో తెలుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. కేసీఆర్‌ పదేళ్లు అధికారంలో ఉండగా, జగన్‌ ఐదేళ్లు ఏపీలో అధికారంలో ఉన్నారు. ఆరు నెలల వ్యవధిలో ఇద్దరూ మాజీలయ్యారు. ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

Written By: Raj Shekar, Updated On : July 13, 2024 12:29 pm

KCR And Jagan

Follow us on

KCR And Jagan: కర్మ అనేది ఎవరినీ వదిలి పెట్టదు. కాస్త ముందూ వెనక. అంతే గానీ కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేదు. అందుకే మనిషిగా మనం చేసే పనులపైనే కర్మ ఆధారపడి ఉంటుంది. మనం మంచి చేస్తే.. కర్మ కూడా మంచే చేస్తుంది. చెడు చేస్తే అనుభవించాల్సిన ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కర్మ ఫలాలు అనుభవించేందుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరికీ చెడు ఫలితాలే ఎదురుకాబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనుల ఆధారంగానే ఈ ఫలితాలు ఉంబోతున్నాయన్నది సుస్పష్టం. దీనిపై ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డికి స్పష్టమైన అవగాహన ఉంది.

స్వయం కృతాపరాధమే..
తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ మాజీ సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇద్దరూ మంచి మిత్రులు. ఆరు నెలల క్రితం వరకు ఇద్దరూ చెరో తెలుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. కేసీఆర్‌ పదేళ్లు అధికారంలో ఉండగా, జగన్‌ ఐదేళ్లు ఏపీలో అధికారంలో ఉన్నారు. ఆరు నెలల వ్యవధిలో ఇద్దరూ మాజీలయ్యారు. ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఏనాటికైనా తాము జైలుకు వెళ్లడం ఖాయమని ఫిక్స్‌ అయ్యారు. ఎందకంటే వారు చేసిన తప్పులు వారికి తెలుసు. ఆ కర్మ ఫలాలనే అనుభవించబోతున్నారు.

కేసీఆర్‌ ఇలా….
తెలంగాణలో కేసీఆర్‌ పదేళ్లు అధికారంలో ఉన్నారు. రెండు సార్లు గెలిచిన ఆయన రెండుసార్లు విపక్షం లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే పనిచేశారు. తనను ఎదురించేవాడు, ప్రశ్నించేవాడు ఉండకూడదన్న భావనతో విపక్షాలను తన పార్టీలో విలీనం చేసుకున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇక ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం చంబ్రాబు నాయుడును అయితే ఓ ఆటాడుకున్నారు. రేవంత్‌రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైలుక పంపించారు. ఆయన కూతురు పెళ్లి ఉందని తెలిసి కూడా దారుణంగా అవమానించారు. కేసీఆర్‌ చేసిన పొరపాట్ల ఫలితంగానే ఇటు రేవంత్‌రెడ్డి అటు చంద్రబాబు నాయుడు ఒకేసారి అధికారంలోకి వచ్చారు.

ఇప్పుడు వారి వంతు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కేసీఆర్‌ వ్యతిరేక ముఖ్యమంత్రులే ఉన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన అకృత్యాలకు ప్రతీకారం తీర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అయితే కేసీఆర్‌ను జైలుకు పంపి చిప్పకూడు తినిపిస్తానని ఎన్నికలకు ముందు శపథం కూడా చేశారు. ఆ ప్రకారమే అధికారంలోకి రాగానే ఫోన్‌ ట్యాపింగ్‌ కాళేశ్వం ప్రాజక్టులో అవినీతి, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలపై విచారణకు ఆదేశించారు. మరో ఆరడజను కేసుల్లో విచారణ చేయిస్తున్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపేందుకు అవసరమైన ఆధారాలు సేకరిస్తున్నారు. ఏదో ఓ కేసులో కేసీఆర్‌ని జైలుకి పంపించడం ఖాయం.

జగన్‌ పరిస్థితి కూడా అంతే..
ఇక ఏపీ మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పరిస్థితి కూడా కేసీఆర్‌లాగానే కనిపిస్తోంది. తాను చేసిన ఐదేళ్ల పాలనతో రాజకీయ కక్ష సాధింపులతోనే గడిపేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని అనేక అక్రమ కేసుల్లో ఇరికించి చివరకు జైలుకు కూడా పంపించారు. ఇక ఎంపీ అని కూడా చూడకుండా రఘురామ కృష్ణంరాజుపై రాజద్రోహం కేసు నమోదుచేయించారు. అరెస్టు చేయించి జైల్లో కుళ్లబొడిపించారు. అరికాళ్లు వాచిపోయేలా కొట్టించారు. ఇప్పుడ అదే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీలో తొలి కేసు నమోదైంది.

ప్రజాస్వామ్యబద్ధంగా టీడీపీ, జనసేన పోరాటం..
ఇదిలా ఉంటే.. జగన్‌ ప్రజావ్యతిరేక పాలనపై గడిచిన ఐదేళ్లు ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ప్రజాసావ్యమ బద్ధంగానే పోరాటం చేశాయి. మరోవైపు ఏపీ అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడును తీవ్రంగా అవమానించింది జగన్‌ సర్కార్‌. చంద్రబాబు కూడా తాను ముఖ్యమంత్రిగానే మళ్లీ అసెంబ్లీకి వస్తానని శపథం చేసి వెళ్లిపోయారు. చెప్పినట్లుగానే ముఖ్యమంత్రిగా మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్‌.. ప్రతిపక్షాలను లెక్క చేయలేదు. టీడీపీ నేతలన వెంటాడారు. వేధించార. చంద్రబాబుతో సహా టీడీపీలోని కీలక నేతందరినీ జైలుక పంపించారు. శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారు. అయితే తర్వాత జరుగబోయే వాటి పర్యవసనాల గురించి కూడా ఆలోచించలేదు. దీంతో ఇప్పుడు జగన్‌పై టీడీపీ సర్కార్‌ కేసులు పెడుతోంది.

తొలి కేసు నమోదు..
తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా మాజీ సీఎం కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా పెట్టలేదు. కానీ ఏపీలో అధికారంలోకి వచ్చిన నెలకే సీఎం చంద్రబాబునాయుడు మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు చేయించాడు. జగన్‌పై తొలి కేసు నమోదు చేయగానే రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అరిచి గగ్గోలు పెట్టేసినంత మాత్రాన్న చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా తప్పించుకోలేరు అన్నది గమనించాలి.