https://oktelugu.com/

Mukesh Gowda: బంపర్ ఛాన్స్ కొట్టేసిన గుప్పెడంత మనసు రిషి… సీరియల్ వదిలేయడానికి రీజన్ ఇదా!

లవర్స్ అంటే రిషి - వసుధారా లాగా ఉండాలి అనేంత నేచురల్ గా నటించి మెప్పించారు. సడన్ గా రిషి తప్పుకోడంతో లవ్ స్టోరీకి బ్రేక్ పడింది. దీంతో టీఆర్పీ కూడా బాగా తగ్గిపోవడంతో రిషి బతికే ఉన్నాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 27, 2024 / 05:31 PM IST

    Mukesh Gowda

    Follow us on

    Mukesh Gowda: గుప్పెడంత మనసు నుంచి ముకేశ్ గౌడ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణాలు ఏమిటో అటు ముకేశ్ గౌడ.. ఇటు డైరెక్టర్… ఇద్దరిలో ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఒకపక్క రిషి కనిపించక ఫ్యాన్స్ ఆందోళన చెందుతుంటే .. కొంత కాలం అతనికి దెబ్బలు తగిలినట్లుగా సీరియల్ లో చూపించారు. ఆ తర్వాత ఏకంగా క్యారెక్టర్ ని లేపేశాడు డైరెక్టర్. రిషి చనిపోయాడంటూ బాంబు పేల్చాడు. దీంతో రిషి లేని గుప్పెడంత మనసు సీరియల్ ప్రాణం లేని దేహంలా మారిపోయింది. సీరియల్ చూసే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది.

    అసలు ముకేశ్ గౌడ సీరియల్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు? మళ్ళీ రీ ఎంట్రీ ఉంటుందా? ఇప్పుడు ముకేశ్ గౌడ ఏం చేస్తున్నాడు? అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. గుప్పెడంత సీరియల్ దాదాపు మూడేళ్ళుగా టెలికాస్ట్ అవుతుంది. రేటింగ్ పరంగా దుమ్మురేపింది. తక్కువ సమయంలోనే ఈ సీరియల్ కి చాలా మంది అభిమానులు అయ్యారు. ముఖ్యంగా రిషి – వసుధారల జోడి, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

    లవర్స్ అంటే రిషి – వసుధారా లాగా ఉండాలి అనేంత నేచురల్ గా నటించి మెప్పించారు. సడన్ గా రిషి తప్పుకోడంతో లవ్ స్టోరీకి బ్రేక్ పడింది. దీంతో టీఆర్పీ కూడా బాగా తగ్గిపోవడంతో రిషి బతికే ఉన్నాడు. త్వరలోనే వస్తాడు అంటూ సీరియల్ ని నడిపిస్తున్నారు. దీంతో రిషి కోసం సీరియల్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. రిషి బ్రేక్ తీసుకోవడానికి కారణం ముకేశ్ గౌడ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు.

    గీత శంకరం టైటిల్ తో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక శర్మ నటిస్తుంది. సినిమా కోసమే అతడు గుప్పెడంత మనసు సీరియల్ కి దూరమైనట్లు తెలుస్తుంది. డేట్స్ అడ్జెస్ట్ అవ్వక సీరియల్ కి గుడ్ బై చెప్పేశాడట. గీత శంకరం షూటింగ్ పూర్తవగానే గుప్పెడంత మనసు సీరియల్ లో రీ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. ప్రస్తుతం ముకేశ్ గౌడ తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా కొన్ని సీరియల్స్ లో నటిస్తున్నారు.