Site icon OkTelugu

Mahesh Babu: మహేష్ బాబు పక్కన ఉన్న స్టార్ హీరో భార్యను గుర్తు పట్టారా? తెలిశాక అవునా! అంటారు

do you know who is this child with mahesh babu

do you know who is this child with mahesh babu

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు టీనేజ్ లో ఉన్నప్పటి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు ఫోటోలో పక్కనే ఓ పాప ఉంది. మహేష్ బాబు, ఆ పాప దేన్నో నిశితంగా పరిశీలిస్తున్నారు. కాగా ఆ పాప ఓ హీరో భార్య. ఎవరీ పాప? ఎవరా హీరో? అనేది చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు కాగా ఇద్దరు అబ్బాయి. పెద్ద కొడుకు రమేష్ బాబు, చిన్న కొడుకు మహేష్ బాబు. రమేష్ బాబు సైతం హీరోగా చిత్రాలు చేశారు. ఆశించిన స్థాయిలో రాణించలేదు.

మహేష్ మాత్రం తండ్రి నట వారసత్వాన్ని నిలబెడుతూ స్టార్ హీరో అయ్యాడు. కృష్ణ కూతుళ్లతో పెద్ద అమ్మాయిని ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్ కి ఇచ్చి వివాహం చేశారు. వీరి అబ్బాయి గల్లా అశోక్ హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. మరో అమ్మాయి మంజుల నిర్మాత, దర్శకురాలు. ఆమె కొన్ని చిత్రాల్లో నటించారు కూడాను. మూడో అమ్మాయి ప్రియదర్శిని అందరికంటే చిన్నది.

పైన ఫోటోలో ఉన్న అమ్మాయి ప్రియదర్శిని. హీరో సుధీర్ బాబు ఈమె భర్త. 2006లో సుధీర్ బాబు-ప్రియదర్శినిల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం. సుధీర్ బాబు 2010లో ఏమాయ చేసావే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. ఆ చిత్రంలో సుధీర్ హీరోయిన్ సమంత అన్నయ్యగా నెగిటివ్ రోల్ చేశాడు. శివ మనసులో శృతి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సుధీర్ హీరోగా నటించిన ప్రేమ కథా చిత్రం సూపర్ హిట్. ఈ చిత్రానికి మారుతి దర్శకుడు.

సుధీర్ బాబు హీరోగా నిలదొక్కుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సక్సెస్ రావడం లేదు. సుధీర్ బాబుకి హిట్ పడి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం హరోంహర టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. అలాగే మా నాన్న సూపర్ హీరో టైటిల్ తో మరొక చిత్రం తెరకెక్కుతుంది. బ్యాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో సుధీర్ నటిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version