Aa 0kkati Adakku: ఇటీవల వరుసగా సీరియస్ కంటెంట్ తో కూడిన చిత్రాలు చేసిన అల్లరి నరేష్ కామెడీ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ‘ ఆ ఒక్కటీ అడక్కు ‘ మే 3న విడుదలైంది. ఆ ఒక్కటీ అడక్కు బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంది. పూర్తి స్థాయిలో మాత్రం మెప్పించలేదు. అల్లరి నరేష్ ఇటీవల ‘ నా సామిరంగ ‘ తో హిట్ అందుకున్నాడు. కానీ ఆయన సోలో హిట్ అందుకుని చాలా కాలం అవుతుంది.
సుడిగాడు తర్వాత అల్లరి నరేష్ కి ఆ రేంజ్ హిట్ లేదు. ఆ విషయం అటుంచితే… ఆ ఒక్కటీ అడక్కు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయినట్లు తెలుస్తుంది. తాజాగా సమాచారం ప్రకారం ‘ ఆ ఒక్కటీ అడక్కు ‘ సినిమా ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం మే 31 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు న్యూస్ వైరల్ అవుతుంది. త్వరలో మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే .. గణ అలియాస్ గణపతి(అల్లరి నరేష్) ప్రభుత్వ ఉద్యోగి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పని చేస్తుంటాడు. తన చేతుల మీదుగా వందల మందికి పెళ్లిళ్లు జరిపిస్తుంటాడు. కానీ అతనికి మూడు పదుల వయసు దాటినా పెళ్లి కాదు. తన కంటే ముందే తమ్ముడికి వివాహం జరిపిస్తాడు. ఇంట్లో వాళ్ళు గణాకి ఎన్నో పెళ్లి సంబంధాలు చూస్తారు. అతనికి ఏవేవో కారణాలు చెప్పి పిల్లను ఇవ్వడానికి నిరాకరిస్తారు. దీంతో హ్యాపీ మాట్రిమోనిలో ప్లాటినం సభ్యుడిగా చేరుతాడు.
ఈ క్రమంలో సిద్ది(పరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. ఆమెను ప్రేమిస్తాడు. కానీ పెళ్ళికి సిద్ది సున్నితంగా తిరస్కరిస్తుంది. ఈ క్రమంలో జబ్బు పడిన తన తల్లిని సంతోష పెట్టేందుకు సిద్ధిని ప్రియురాలిగా ఇంటికి తీసుకువస్తాడు. కట్ చేస్తే .. ఆ మరుసటి రోజు సిద్ది మాట్రిమోని లో పేరు నమోదు చేసుకున్న అబ్బాయిలను మోసం చేస్తుంది అంటూ ఓ వార్త బయటకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది. ఈ కేసు నుండి సిద్ధిని గణ ఎలా కాపాడుతాడు. మాట్రిమోని సైట్ వాళ్ళ ఆగడాలు ఎలా అరికట్టాడు అన్నది స్టోరీ.