OTT Trending Movie: కొన్ని సినిమాలు థియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్ అవుతాయి, కానీ ఓటీటీ మరియు టీవీ టెలికాస్ట్ లలో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ లను దక్కించుకుంటూ ఉంటాయి. ఈమధ్య కాలం లో అలాంటి సినిమాలను చాలానే చూసాం మనం. అందుకు రీసెంట్ ఉడకారణ రామ్ చరణ్(Global Star Ram Charan) ‘గేమ్ చేంజర్’. థియేటర్స్ లో డిజాస్టర్ గా నిల్చిన ఈ చిత్రం, ఓటీటీ లో మాత్రం బంపర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా జీ తెలుగు యాప్ లో విడుదలైన హిందీ వెర్షన్ కి 400 మిల్లియన్లకు పైగా వాచ్ మినిట్స్ వచ్చాయి. ఒక ఫ్లాప్ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం ఈమధ్య కాలంలో ఈ సినిమాకే జరిగింది. అలాగే మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం కూడా ఈ కోవకు చెందిన సినిమానే. ఇదంతా పక్కన పెడితే థియేటర్స్ లో కనీసం వారం రోజులు కూడా ఆడని ఒక డిజాస్టర్ సినిమా, ఓటీటీలో 11 ఏళ్ళ నుండి ట్రెండ్ అవుతుంది.
Also Read: 5 సార్లు రీ రిలీజ్ అయిన ‘ఒక్కడు’..ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ ఎంతంటే!
ఆ సినిమా మరేదో కాదు, సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటించిన ‘కొచ్చాడియాన్: ది లెజెండ్’ చిత్రం. 2014 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాకపోవడం అప్పట్లో అందరినీ షాక్ కి గురి చేసింది. మొట్టమొదటిసారి ఈ చిత్రం కోసం ఫోటో రియలిస్టిక్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ని ఉపయోగించారు. ఈ చిత్రానికి రజినీకాంత్ పెద్ద కుమార్తె, సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించింది. ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజునే అప్పట్లో రజినీకాంత్ అనారోగ్యంతో హాస్పిటల్ పాలైన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆ సమయంలో రజినీకాంత్ కి ఏమవుతుందో అని వణికిపోయారు. ఆయన కోలుకున్న తర్వాత మళ్ళీ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. దాదాపుగా ఈ చిత్రం కోసం 125 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశారు.
కానీ బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 30 కోట్లు మాత్రమే రాబట్టింది. తెలుగు తో పాటు హిందీ, మలయాళం, తమిళం, బెంగాలీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదలైంది. కానీ ఒక్క చోట కూడా ఆకట్టుకోలేకపోయింది ఈ చిత్రాన్ని. అయితే ఈ సినిమాని అప్పట్లో అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇదో ప్రపంచ రికార్డు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తో చేసిన ‘కూలీ’ అనే చిత్రం ఆగస్టు 14 న విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ని రీసెంట్ గానే పూర్తి చేసిన రజినీకాంత్, కేరళలో ‘జైలర్ 2’ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టాడు.