CSK Vs MI IPL 2025: ఐపీఎల్ చరిత్రలో ముంబై, చెన్నై మధ్య పోటీ అంటే హై వోల్టేజ్ లెవల్ లోనే సాగుతుంది. ఇక ప్రస్తుత సీజన్లో చెన్నై, ముంబై జట్లు ఒకసారి తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు చెన్నై జట్టుకు అత్యవసరంగా ఒక విజయం కావాలి. ఆ జట్టు విజయం సాధిస్తేనే పాయింట్లు పట్టికలో దాదాపు నైన్త్ ప్లేస్ లోకి వస్తుంది. అప్పుడు హైదరాబాద్ లాస్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ కూడా చెన్నై జట్టు గెలవాల్సి ఉంది. ఇప్పటికే చెన్నై జట్టు ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది. కేవలం రెండు జట్లపై మాత్రమే విజయం సాధించింది. అయితే చెన్నై ఇంకా ఏడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ ఏడు మ్యాచ్లలో వరుసగా భారీ వ్యత్యాసంతో ప్రత్యర్థులపై గెలవాలి. అప్పుడే చెన్నై ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆరు మ్యాచుల్లో గెలిస్తే.. ప్రత్యర్థి జట్ల ఫలితాలు, నెట్ రన్ రేట్ ఆధారంగా చెన్నై జట్టుకు ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశాలుంటాయి. ముంబై జట్టు కూడా ఏడు మ్యాచ్లు ఆడింది. మూడు విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
Also Read: 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ సిక్స్.. నువ్వు సూపర్ అహే
చెన్నై జట్టు మారాలి
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో చెన్నై జట్టు మారాల్సిన అవసరం ఉంది. చెన్నై జట్టు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. బౌలింగ్ దళం ఆ జట్టు అవసరాలు తీర్చలేక పోతుంది. ఇక బ్యాటర్ల విషయంలోనూ అదే ధోరణి కొనసాగుతోంది. ఫీల్డింగ్ లోనూ అద్భుతమైన క్యాచ్ లను అందుకోవడంలో చెన్నై జట్టు ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ఇక ఈ సీజన్ లోక్ ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. ఇప్పుడు ముంబై జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది. దీనికి కారణం ఇటీవల ఆ జట్టు సాధించిన విజయాలే. తదుపరి ఏడు మ్యాచ్లు వరుసగా గెలిచి.. ప్లే ఆఫ్ చేరుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భావిస్తున్నది. గత సీజన్లో కూడా బెంగళూరు ఇలానే ఆడింది. చివరికి ప్లే ఆఫ్ అవకాశాలను దక్కించుకుంది. అయితే ఈసారి చెన్నై కూడా అటువంటి అద్భుతం చేస్తుందని.. ఆ జట్టు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆదివారం ముంబై జట్టుతో జరిగే మ్యాచ్లో చెన్నై అత్యంత ముమ్మరంగా సాధన చేస్తోంది. ఒకవేళ చెన్నై జట్టు కనుక ముంబై పై విజయం సాధిస్తే.. ఇక ఆ జట్టుకు ఎంతో కొంత సాంత్వన లభించినట్టే